ఫ్యాక్షన్ నేపథ్యంలోనే .. మహేష్ సినిమా ?

Thursday, May 10th, 2018, 10:14:12 AM IST

తాజాగా భరత్ అనే నేను సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు తన నెక్స్ట్ సినిమా విషయంలో బిజీగా మారాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందే ఈ సినిమా ఎక్కువ భాగం అమెరికాలో షూటింగ్ జరుగుతుందట. అయితే సినిమా మాత్రం రాయలసీమ నేపథ్యంలో కథ సాగుతుందని టాక్. ఇప్పటికే వంశీ పైడిపల్లి అమెరికాలో పలు లొకేషన్స్ అన్వేషణలో ఉన్నాడు. ఊపిరి సినిమా తరువాత మహేష్ కోసం దాదాపు ఏడాదిన్నరకు పైగా వెయిట్ చేసాడు వంశీ. మహేష్ బాబు కెరీర్ లో ఇంతవరకు టచ్ చేయని రాయలసీమ ఫ్యాక్షనిజం నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో మహేష్ ఫాన్స్ లో ఆసక్తి పెరిగింది. మహేష్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా వచ్చే వారంలో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టనున్నారు. మరి మహేష్ బాబు ఫ్యాక్షనిజం చేస్తే ఎలా ఉంటుందో చూడాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే .. ? మహేష్ 25 వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా తరువాత అయన సుకుమార్ తో సినిమాకు కమిట్ అయినా విషయం తెలిసిందే.

  •  
  •  
  •  
  •  

Comments