200 కోట్లను ఎవరు ముందు అందుకున్నారంటే?

Wednesday, May 2nd, 2018, 01:10:01 PM IST

సమ్మర్ సీజన్ లో తెలుగు సినిమాలు మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతున్నాయి. 2018 మొదట్లో కొంచెం డాల్ గా స్టార్ట్ అయినా సినిమాల కలెక్షన్స్ రంగస్థలం సినిమాతో సమ్మర్ లో బాక్స్ ఆఫీస్ వేడెక్కుతోంది. భరత్ అనే నేను సినిమా కూడా మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. అయితే రీసెంట్ గా 200 కోట్ల గ్రాస్ అందుకున్న రామ్ చరణ్ రంగస్థలం ను బీట్ చేస్తూ మహేష్ – భరత్ అనే నేను కూడా అదే తరహాలో రీసెంట్ గా 200 కోట్లను క్రాస్ చేసి అందరిని షాక్ కి గురి చేసింది. రంగస్థలం మార్చ్ 30న రిలీజ్ అవ్వగా.. భరత్ అనే నేను ఏప్రిల్ 20న రిలీజ్ అయ్యింది. అంటే దాదాపు నెల రోజుల తరువాత రంగస్థలం రెండు వందల మార్క్ ను అందుకోగా మహేష్ సినిమా కేవలం 12 రోజుల్లోనే ఆ రికార్డ్ ను అందుకుంది. ఈ విషయాన్ని ట్రేడ్ విశ్లేషకుడు, ఇండస్ట్రీ అనలిస్ట్ రమేష్ బాలా సోషల్ మీడియా ద్వారా తెలిపారు.