దీపావళికే మహేష్ మల్టిప్లెక్స్ ప్రారంభం?

Saturday, October 6th, 2018, 01:24:14 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇన్నాళ్లు హీరోగానే మనకు తెలుసు .. కానీ అయన ఇప్పుడు బిజినెస్ రంగంలోకి అడుగు పెడుతున్నాడు. తాజాగా అయన మల్టి ప్లెక్స్ బిజినెస్ ని ఎంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆసియన్ సినిమాస్ తో కలిసి ఈ బిజినెస్ హైదరాబాద్ లో మొదలు పెట్టాడు. ప్రస్తుతం గచ్చిబౌలి లో ఈ మల్టి ప్లెక్స్ నిర్మాణం జరుగుతుంది. దాదాపు ఐదు థియేటర్స్ తో పాటు అదిరిపోయే షాపింగ్ కాంప్లెక్ సిద్ధం అవుతుంది. లేటెస్ట్ గా టెక్నాలజీతో ఈ మల్టిప్లెక్స్ లు నిర్మిస్తున్నారు. వీటిని దీపావళికి ఓపెన్ చేస్తారట. ఆ తరువాత వైజాగ్, తిరుపతి, విజయవాడ ప్రాంతాల్లో కూడా మహేష్ మల్టి ప్లెక్స్ లు నిర్మించనున్నాడు. మహేష్ బాబు కార్పొరేషన్ అండ్ ఆసియన్ సినిమాస్ ఈ మల్టిప్లెక్స్ బిజినెస్ ని మొదలు పెట్టాయి.