మహేష్ ఫస్ట్ లుక్ సూపర్ అంటున్నారు

Wednesday, February 8th, 2017, 11:43:37 AM IST


మహేష్ బాబు – మురగదాస్ ల కాంబినేషన్ లో రాబోతున్న కొత్త సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా మహేష్ ఫాన్స్ లో ఈ సినిమా క్రేజ్ ఎంతగా ఉంది అంటే ఇంకా ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు ఏవీ రాలేదు అని వారే మేకింగ్ పోస్టర్ లు చేసేస్తున్నారు. అవి కూడా అల్లా టప్పా గా లేవు అద్దిరిపోయి నిజమైన ఫస్ట్ లుక్ లు లాగానే ఉన్నాయి తాజాగా మహేష్ 23 అంటూ ఇలాంటిదే ఓ పోస్టర్ నెట్ లో హల్ చల్ చేసింది. మహేష్ గాల్లో ఎగురుతున్నట్లుగా ఉండే ఈ పోజ్ చూసి చాలామంది అభిమానులు తెగ ఉత్సాహపడ్డారు.కానీ ఇది 2014లో రిలీజ్ అయిన హాలీవుడ్ మూవీ బ్రిక్ మాన్షన్స్ ను కాపీ చేశారంతే. అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ స్టోరీగా తెరకెక్కిన ఆ మూవీలో.. డేవిడ్ బెల్లె జంపిగ్ సీన్ కు.. మహేష్ ఫేస్ ను మార్ఫింగ్ చేశారు. ఈ విషయం తెలిశాక మహేష్ ఫ్యాన్స్ నిరుత్సాహపడ్డా.. ఈ రేంజ్ కి తగ్గకుండా తమ హీరో సినిమా ఉంటుందని ఆశలు పెట్టేసుకుంటున్నారు.