షాక్ … మహేష్ న్యూ లుక్ ఇలాగె ఉంటుందా ?

Wednesday, May 30th, 2018, 11:31:14 PM IST

ఈ మధ్య హీరోలు సినిమాల విషయంలో కాస్త కొత్త గెటప్స్ కోసం ముందుకు వస్తున్నారు. జనరల్ గా తెలుగు హీరోలంటే ఏ సినిమాలో చుసిన ఒకేలా ఉంటారని .. కనీసం ఫైట్ చేసినప్పుడు కూడా కల్లోజోడు కదలదనే విమర్శలు ఉన్నాయి. కానీ నేటితరం హీరోలు ఆ ట్రెండ్ ని మార్చే పనిలో పడ్డారు. ఇప్పటికే ఎన్టీఆర్ , రామ్ చరణ్ లు లుక్స్ మర్చి మంచి విజయాలను అందుకున్న నేపథ్యంలో తాజాగా ఈ ప్రయోగం ఇప్పుడు మహేష్ చేయనున్నాడు. మహేష్ 25 వ సినిమా జూన్ 10 షూటింగ్ మొదలు కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించే ఈ సినిమాకోసం మహెష్ పెద్ద జుట్టు .. గుబురు గడ్డం తో కనిపిస్తాడని అంటున్నారు. పైగా ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది కూడా. తాజాగా మహేష్ అభిమానులు తమ హీరో గడ్డం లుక్ లో ఎలా ఉంటాడో అన్న క్యూరియాసిటీ తో రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు.

తాజాగా మహేష్ గడ్డం లుక్ లో ఓ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఆ సినిమాకు రాజసం అనే టైటిల్ పెట్టారు .. ఆ టైటిల్ పై ఎలాంటి కన్ఫర్మ్ లేదు .. కానీ మహేష్ లుక్ అందరికి షాక్ ఇస్తుంది. దిల్ రాజు, అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి సందర్బంగా విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మరి మహేష్ గడ్డం లుక్ ఎలా ఉంటుందో చూడాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

  •  
  •  
  •  
  •  

Comments