మ‌హేష్ సినిమా పేర్లంటూ..!

Saturday, September 24th, 2016, 01:16:24 AM IST

mahesh
సెట్స్‌పైకి వెళ్ల‌క‌ముందే మ‌హేష్‌బాబు సినిమా పేరు `ఎనిమీ` అంటూ ప్ర‌చారం సాగింది. కానీ మ‌హేష్‌తోపాటు, ద‌ర్శ‌కుడు మురుగదాస్‌లు ఆ విష‌యాన్ని కొట్టిపారేశారు. త‌మ సినిమాకి ఇంకా పేరు ఫిక్స్ చేయ‌లేద‌ని స్టేట్‌మెంట్ ఇచ్చారు. అయినా స‌రే ఆ పేరుకు సంబంధించి ప్ర‌చారం మాత్రం ఆగ‌డం లేదు. తాజాగా మ‌రో రెండు పేర్లు తెర‌పైకొచ్చాయి. `శివ‌`, `అభిమ‌న్యుడు` అనే పేర్ల‌లో ఒక‌దాన్ని ఫిక్స్ చేయాల‌ని చిత్ర‌బృందం ఆలోచిస్తున్న‌ట్టు వార్త‌లొస్తున్నాయి. మ‌రి నిజంగా ఆ పేర్ల‌ని చిత్ర‌బృందం ప‌రిశీలిస్తుందా, లేదంటే ఇదివ‌ర‌క‌టిలాగా మ‌ళ్లీ ప్ర‌చారంగా బ‌య‌టికొచ్చిన పేర్లేనా అన్న‌ది తెలియాల్సి వుంది. సినిమా చిత్రీక‌ర‌ణ ఒక మోస్తరుగా పూర్త‌యింది కాబ‌ట్టి, దీపావ‌ళికి టీజ‌ర్‌ని విడుద‌ల చేస్తారు కాబ‌ట్టి ఇక పేరు ఫిక్స్ చేయ‌డం గురించి కూడా సీరియ‌స్‌గా ఆలోచించాల్సిందే. అలా ఆలోచన‌ల్లో ఉన్న‌ప్పుడే ఈ పేర్లు బ‌య‌టికొచ్చాయ‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు చెబుతున్నాయి.