ఈ ఏడాది మహేష్ సినిమా లేనట్టే ?

Tuesday, June 26th, 2018, 10:33:14 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన భరత్ అనే నేను సూపర్ హిట్ అవ్వడంతో అయన ఫాన్స్ మంచి ఖుషి మీదున్నారు .. నెక్స్ట్ సినిమా దసరాకో .. దీపావళికో వస్తుందన్న ఆశతో ఉన్నారు .. కానీ వారికీ ఈ ఏడాది నిరాశే మిగలనుంది. ఎందుకంటే ఈ ఏడాదిలో మహెష్ సినిమా వచ్చే అవకాశాలు లేవు . మహేష్ తాజాగా నటిస్తున్న 25 వ సినిమా ఇటీవలే డెహ్రూడున్ లో ప్రారంభం అయినా విషయం తెలిసిందే, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కు చాలా సమయం పట్టేలా ఉంది .. ఒకవేల తొందరగా అయిపోతే కనీసం సంక్రాంతికి అయినా వస్తుందేమో అనుకున్నారు ..

కానీ యూనిట్ వర్గాలు మాత్రం .. సంక్రాంతికి కాదు ఉగాదికే అంటూ క్లారిటీ ఇచ్చేసారు. సో సూపర్ స్టార్ అభిమానులకు ఖచ్చితంగా ఈ ఏడాది నిరాశే మిగలనుంది. వంశీ పైడి పల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఏప్రిల్ 6న ఉగాది రోజున విడుదల అవుతుందట. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా తో పాటు సుకుమార్ తో సినిమాకు ఓకే చెప్పాడు మహెష్ .. నవంబర్ నుండి ఆ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటాడట.