న్యూ యార్క్ లోనే మహేష్ మొదలు పెట్టేది ?

Monday, April 30th, 2018, 09:51:53 PM IST


ప్రస్తుతం భరత్ అనే నేను సినిమా విజయంతో మంచి జోరుమీదున్న మహేష్ తన తదుపరి సినిమాకు సన్నాహాలు మొదలు పెట్టాడు. ఊపిరి ఫేమ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి గత ఏడాది కాలంగా వంశీ పైడిపల్లి మహేష్ సినిమా కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు. ఇక భరత్ పూర్తయింది కాబట్టి వంశీ షూటింగ్ కు సంబందించిన పనులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో న్యూ యార్క్ లో మహేష్ సినిమా షూటింగ్ మొదలు కానుంది. ఇప్పటికే అక్కడికి వెళ్లిన వంశీ లొకేషన్స్ వేటలో పడ్డాడు. ఈ కథ ప్రకారం విదేశాల్లోనే ఎక్కువ షూటింగ్ ఉంటుందని టాక్. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించే ఈ చిత్రంలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.

  •  
  •  
  •  
  •  

Comments