మహేష్ తో షుగర్ ఫ్యాక్టరీ కన్ఫర్మ్ అయినట్టే ?

Friday, February 2nd, 2018, 12:39:11 AM IST

టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి సినిమా క్రియేట్ చేసిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆ సినిమా దెబ్బకు అటు బాక్స్ ఆఫీస్ బద్దలైంది. ఈ సినిమా అన్ని భాషల్లో రీమేక్ హక్కులు ఓ రేంజ్ లో అమ్ముడయ్యాయి. అలాంటి సంచలన సినిమాతో దర్శకుడిగా మంచి క్రేజ్ తెచ్చుకున్న సందీప్ వంగ నెక్స్ట్ సినిమా ఏకంగా మహేష్ తో ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే మహేష్ తో కథ చర్చలు కూడా జరిగాయని, కథ నచ్చడంతో స్క్రిప్ట్ సిద్ధం చేయమని మహేష్ చెప్పాడని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న భరత్ అనే నేను సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమా తరువాత వంశీ పైడి పల్లి దర్శకత్వంలో మరోలా సినిమాలో నటించనున్నాడు మహేష్. ఈ సినిమా తరువాత సందీప్ సినిమా ఉంటుందని టాక్. అయితే మహేష్ కోసం సందీప్ ఓ సూపర్ కథను సిద్ధం చేస్తున్నాడట, ఈ సినిమాకు టైటిల్ కూడా బిన్నంగా ప్లాన్ చేసాడు .. ఇంతకీ ఆ టైటిల్ ఏమిటో తెలుసా .. షుగర్ ఫ్యాక్టరీ అని ఫిక్స్ చేస్తారట.