సుకుమార్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సూపర్ స్టార్ ?

Thursday, April 12th, 2018, 11:09:31 AM IST

రంగస్థలం సినిమా తరువాత క్రేజీ దర్శకుడు సుకుమార్ కు మరో బంపర్ అఫర్ దక్కింది. ఆయనకు సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ సినిమా చేసేందుకు ఓకే చెప్పాడట. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన 1 నేనొక్కడినే సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించకపోయినా సూపర్ టెక్నీకల్ మూవీ గా గుర్తింపు దక్కింది. ఆ సినిమా ప్లాప్ అయినా సరే సుకుమార్ టాలెంట్ నచ్చిన మహేష్ మరోసారి ఆయనతో సినిమాకు సిద్ధం అయ్యాడు. ప్రస్తుతం సుకుమార్ రంగస్థలం సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొడుతున్నాడు. రామ్ చరణ్ ను నటుడిగా నెక్స్ట్ లెవెల్ లో ప్రజెంట్ చేసిన సుకుమార్ – మహేష్ ల సినిమాకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మహేష్ ప్రస్తుతం కొరటాల శివ తో భరత్ అనే నేను సినిమాలో నటిస్తున్నాడు. ఈ నెల 20న ఈ చిత్రం విడుదల కానుంది. దాని తరువాత వంశీ పైడిపల్లి తో తన 25వ సీనిమా చేయనున్నాడు. సో అన్ని కుదిరితే మహెష్ 26 లేదా 27వ సినిమాను సుకుమార్ చేసే అవకాశం ఉంది.