ఆ దర్శకుడి దృష్టిలో .. మహేష్ రైతుబిడ్డేనా?

Tuesday, June 5th, 2018, 09:57:19 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న 25వ సినిమాకు సన్నాహాలు జోరందుకున్నాయి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా ఈ నెల రెండో వారంలో డెహ్రూడోన్ లో షూటింగ్ మొదలు కానుంది. ఈ నెలాఖరువరకు అక్కడే షూటింగ్ జరుపుతారట. దిల్ రాజు, అశ్వినీదత్ నిర్మించే ఈ సినిమాలో హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం వైరల్ అవుతుంది .. అదేమిటంటే ఇందులో మహెష్ రైతుగా కనిపిస్తాడట. అందుకోసమే అయన గడ్డం .. బారి హెయిర్ స్టైల్ లో కనిపిస్తాడట. దానికోసం ఇప్పటికే మహెష్ గడ్డం పెంచే పనిలో పడ్డాడు. పైగా ఈ సినిమాకు కూడా రైతుబిడ్డ అనే టైటిల్ పెడుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయం పై ఎలాంటి క్లారిటీ లేదు .. మరి ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నయోగాని ప్రస్తుతం మహేష్ ని న్యూ లుక్ లో చేస్తామన్న ఆసక్తి మహేష్ అభిమానుల్లో ఉంది.

  •  
  •  
  •  
  •  

Comments