హాలిడే ట్రిప్ లో మహేష్ ఫుల్ హ్యాపీ

Wednesday, January 3rd, 2018, 05:57:13 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫ్యామిలీతో హాలిడేస్ ట్రిప్ ను ఎంత ఆనందంగా ఎంజాయ్ చేస్తాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. షూటింగ్ తో బిజీ బిజీగా ఉండే మహేష్ ఏ మాత్రం గ్యాప్ దొరికినా ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళుతుండడం చాలా కామన్. అక్కడే కొన్ని రోజుల వరకు తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేసి వస్తుంటాడు. అదే తరహాలో రీసెంట్ గా మహేష్ ఒమాన్ కి వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ ప్రముఖ దేశాలను చుట్టేసిన మహేష్ ఫ్యామిలీ ఒక చోట పారాగ్లైడింగ్ కూడా చేశారు. అందుకు సంబందించిన ఫొటోలు నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. మహేష్ గౌతమ్‌ పారాగ్లైడింగ్ చేయడానికి రెడీగా ఉన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. మహేష్ కుటుంబ సన్నిహితులు కూడా ఈ ట్రిప్ లో ఉన్నారు. ఇక ఈ హాలిడే ట్రిప్ అయిపోయిన తరువాత మహేష్ కొరటాలతో చేస్తోన్న భరత్ అనే నేను షూటింగ్ ను కంటిన్యూ చేయనున్నాడు.