గౌతమ్ పై శ్రీనువైట్ల చూపు.. నో చెప్పిన మహేష్?

Monday, July 23rd, 2018, 02:35:20 PM IST

టాలీవుడ్ లో ప్రస్తుతం హిట్టుకోసం ఎదురుచూస్తోన్న దర్శకుల్లో శ్రీను వైట్ల మొదటి స్థానంలో ఉన్నాడని చెప్పవచ్చు. వరుసగా చేసిన సినిమాలు డిజాస్టర్ అవ్వడంతో హీరోలు కూడా ఆయనను దూరం పెట్టినట్లు మొన్నటివరకు టాక్ బాగా వచ్చింది. అయితే ఫైనల్ గా మాస్ మహారాజాతో కలిసి ఒక బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. ఇప్పటికే సినిమాను కూడా మొదలుపెట్టేశారు. అమర్ అక్బర్ అంథోని అనే ఆ సినిమా ఫుల్ ఎంటర్టైనర్ అని చిత్ర యూనిట్ చెబుతోంది.

అయితే ఆ సినిమాలో కొన్ని చిన్ననాటి సన్నివేశాలకు సంబంధించి దర్శకుడు ఇటీవల మహేష్ ను కలిశాడట. మహేష్ తనయుడు గౌతమ్ ను ఒక పాత్ర కోసం రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే మహేష్ ఈ సీనియర్ దర్శకుడి విన్నపాన్ని సున్నితంగా తిరస్కరింఛాడాట. ప్రస్తుతం గౌతమ్ తన స్టడీస్ తో బిజీగా ఉన్నాడని షూటింగ్ అనే ఆలోచన ఎక్కువైతే చదువుకు ఇబ్బంది కలుగవచ్చని అందుకే వాటికి దూరంగా ఉంచేందుకు ఒప్పుకోవడం లేదని సమాధానం ఇచ్చారట. దీంతో శ్రీను వైట్ల కూడా ఒకే అని చెప్పి మరోదారిని వెతుకుంటున్నారని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది.

  •  
  •  
  •  
  •  

Comments