రాజకీయాలతో నాకు సంబంధం లేదు.. మహేష్ షాకింగ్ కామెంట్స్!

Sunday, April 8th, 2018, 01:10:45 AM IST

ఇక నుంచి ట్రెండు మారుతుంది. అందరు హీరోలు అన్ని వేడుకలకు వెళతారు అనే తరహాలో మహేష్ బాబు భరత్ బహిరంగ సభలో చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. వేడుకకి తారక్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తారక్ స్పీచ్ అయిపోగానే మహేష్ మైక్ అందుకొని నవ్వుతు తన స్పీచ్ ను మొదలుపెట్టాడు. మహేష్ మాట్లాడుతూ.. ‘కృష్ణ గారబ్బాయనే నేను’ ఇలా మాట్లాడటం తమ్ముడు తారక్ దగ్గర నుంచి ఇప్పుడే నేర్చుకున్నా.. అప్పట్లో తారక్ ఆది సినిమా ఆడియో వేడుకకు నేను వెళ్లాను. మళ్లీ ఇన్నాళ్లకు తారక్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రావడం చాలా సంతోషంగా ఉంది.

ఇప్పటి నుంచి ఫంక్షన్ల ట్రెండు మారుతుంది. ఎందుకంటే మన ఇండస్ట్రీలో ఉన్నది ఐదుగురు ఆరుగురు పెద్ద హీరోలే. తిప్పి కొడితే ఏడాదికి ఒక్కొక్క సినిమానే చేస్తాం. అందరి సినిమాలు ఆడితే బావుంటుంది. మేము మేము బాగానే ఉంటాం. మిరే ఇంకా బాగుండాలి. ఇక కొరటాల శివ గారు ముందు కథ చెప్పినప్పుడు సీఎం క్యారెక్టర్ అనగానే కొంచెం భయం వేసింది. ఎందుకంటే రాజకీయాలకు నాకు సంబంధం లేదు. వాటికి దూరంగా ఉంటాను. వాటి గురించి పట్టించుకోను ఎప్పటికి సినిమానే. ఈ సినిమాను ఇన్సిపిరేషన్ గా తీసుకుని చేశాను. శ్రీమంతుడు నా కెరీర్ లో ఒక టర్ణింగ్ పాయింట్. ఇప్పుడు భరత్ అనే నేను కూడా అలానే అవుతుందని నా కెరీర్ లో ఇదే బెస్ట్ పర్ఫార్మెన్స్ కనబరిచిన సినిమా అంటూ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఏప్రిల్ 20న మా అమ్మ ఇందిరమ్మ గారి పుట్టినరోజు. అదే రోజున సినిమా విడుదల కాబోతోందని మహేష్ తెలియజేశారు.