షాక్ .. గెడ్డం పెంచనున్న మహేష్ ?

Saturday, May 19th, 2018, 02:11:22 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే అందగాడు .. స్మార్ట్ బాయ్ అని అందరు అంటారు .. అందుకే ఆయనకు అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువ. మరి సినిమాల్లో కూడా మహేష్ తన లుక్ ని మార్చడానికి ఎక్కువ ఇష్టపడడు. ఆ మధ్య పోకిరి సినిమాలో లుక్ మర్చి ఆకట్టుకున్న మహేష్ ఆ తరువాత స్థితిలో హెయిర్ స్టైల్ మార్చాడు .. కానీ అది జనాలకు అంతగా నచ్చలేదు. దాంతో మళ్ళీ లుక్ విషయంలో చేంజ్ గురించి ఆలోచించని మహేష్ ఈ సారి వంశీ పైడిపల్లి కోసం ఏకంగా గడ్డాన్ని పెంచే ఆలోచనలో ఉన్నాడట !! ఏంటి మహేష్ ని గడ్డం లో చుస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన కలిగిందా. నిజమే ఈ మధ్య హీరోలతో బారి గడ్డాన్ని పెంచేస్తూ .. సంచలన విజయాలను అందుకుంటున్నారు. ఎన్టీఆర్ తో భారీ గడ్డం పెంచేలా చేసి నాన్నకు ప్రేమతో అంటూ హిట్ కొట్టాడు .. ఆ తరువాత రామ్ చరణ్ తో భారీ గడ్డం పెంచేలా చేసి .. రంగస్థలం తీసి ఏకంగా 200 కోట్ల భారీ వసూళ్లతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఇప్పుడు అదే ఫార్ములా ఫాలో అవుతూ మహేష్ ని గడ్డం లుక్ లో చూపించాలని భావిస్తున్నాడట వంశీ పైడిపల్లి. మహేష్ ని కొత్తగా చూపే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఒకవేళ మహేష్ గడ్డం లుక్ లో సెట్ కాలేదంటే .. మాములు లుక్ లోనే ఉంచేస్తాడట. మరి మహేష్ ని కొత్త లుక్ లో చూడాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

  •  
  •  
  •  
  •  

Comments