అక్కడ బాహుబలి ని దాటేసిన మహేష్ బాబు ‘స్పైడర్’

Sunday, March 4th, 2018, 12:56:25 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల తమిళ అగ్రదర్శకులు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం నటించిన సినిమా స్పైడర్. ఎన్నో భారీ అంచనాల మధ్య విడుదలయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ అంచనాలను అందుకోలేకపోయింది. ఈ సినిమాను కొన్న జీ జీతెలుగు ఇటీవల టీవీ లో ప్రదర్శించగా పెద్దగా టి ఆర్ పి రేటింగ్స్ రాలేదనే చెప్పాలి. అయితే ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ్ లో కూడా ఒకేసారి నిర్మించి విడుదల చేసిన విషయం తెలిసిందే. తమిళనాట విడుదలయిన ఈ సినిమా యావరేజ్ చిత్రంగా నిలిచింది.

అయితే ఈ సినిమా తమిళ్ శాటిలైట్ రైట్స్ కొన్న సన్ టీవీ లో ఇటీవల ప్రదర్శితం అయినా ఈ సినిమా టి ఆర్ పి పరంగా అక్కడ దుమ్ము దులిపినట్లు తెలుస్తోంది. తెలుగులో కూడా ఇదివరకు మహేష్ నటించిన ఒక్కడు, అతడు, మురారి, పోకిరి, ఖలేజా, శ్రీమంతుడు, దూకుడు వంటి చిత్రాలు మంచి టి ఆర్ పి లు సాధించాయి. అందులో మరీ ముఖ్యంగా చెప్పుకోవలసింది అతడు. అప్పట్లో రేటింగ్స్ పరంగా ఈ చిత్రం ఎన్నో రికార్డులు సొంతం చేసుకుంది. అందుకే ఈ చిత్రాన్ని ఇప్పటికీ మా టివి సంస్థ రెన్యువల్ చేసుకుంటూనే వుంది.

అలానే ఖలేజా చిత్రం కూడా జెమినీ లో ప్రదర్శితమై మంచి టి ఆర్ పి సాధించింది. ప్రస్తుతం ఇప్పుడు స్పైడర్ తమిళ టీవీ టేఆర్పీ చరిత్ర లో రికార్డుల మోత మోగిస్తున్నది. ఇంతవరకు తమిళ్ వెర్షన్ లో తీసిన ఏ తెలుగు సినిమాకు రానంత భారీ స్థాయిలో 10.4 టిఆర్ పి రేటింగ్ తో స్పైడర్ ఏకంగా బాహుబలి 2నే క్రాస్ చేసింది. మహేష్ గ్లామర్, మురుగదాస్ దర్శకత్వం, ఎస్ జే సూర్య విలనిజం అక్కడి ఆడియన్స్ ని దీని వైపు మళ్లేలా చేసుకున్నాయి.

ఈ పరంగా చూస్తే స్పైడర్ తెలుగులో కంటే కోలీవుడ్ టీవీలో ఎక్కువ రేటింగ్ తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఏదైతేనేం తన సత్తా బుల్లితెరపై మరోసారి చాటాడు మన సూపర్ స్టార్. ఊహించని రీతిలో ఇది రేటింగ్స్ దక్కించుకోవడంతో రిపీట్ టెలికాస్ట్ లో మంచి రాబడి ఇస్తుందని సన్ టీవీ ఆనందంగా ఉంది. కాగా దీని ప్రభావం భరత్ అనే నేను పై కూడా పడిందని, అప్పుడే భరత్ అనే నేను తమిళ హక్కుల కోసం భారీ డిమాండ్ ఏర్పడిందని టాక్. దీన్నిబట్టి చూస్తే మహేష్ కి తమిళం లో ఎంత క్రేజ్ అర్ధం అవుతోంది….