మళ్ళీ రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టనున్న మహేష్ ?

Thursday, December 29th, 2016, 01:31:50 PM IST

mahesh
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలకు ఎంత ఇంపార్టెంట్ ఇస్తాడో .. అంతే ఇంపార్టెంట్ ఫ్యామిలీ కి ఇస్తాడన్న విషయం తెలిసిందే. తనకు ఏ చిన్న షూటింగ్ గ్యాప్ దొరికినా కూడా ఫ్యామిలీతో కలిసి విదేశాలకు చెక్కేయడం.. అక్కడ ఎంజాయ్ చేయడం చూస్తున్నాం. ప్రస్తుతం విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న మహేష్ తన హాలిడేస్ ని పూర్తీ చేసుకుని తిరిగి రానున్నాడు. ఆ వెంటనే అయన సినిమా షూటింగ్ లో పాల్గొంటాడట. ఇప్పటికే మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ దాదాపు 70 పర్సెంట్ పూర్తీ అయింది. ఆ మిగతా షూటింగ్ ను కూడా ఫిబ్రవరి వరకు పూర్తీ చేసేయాలని ప్లాన్ లో ఉన్నారు. జనవరి 7 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందట. హైద్రాబాద్ తో పాటు , పూణే , ముంబై ల్లో కూడా కొన్ని రోజులు షూటింగ్ జరుపుతారట. ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. అన్నట్టు ఈ చిత్రానికి ఇంకా టైటిల్ కన్ఫర్మ్ చేయలేదు?

  •  
  •  
  •  
  •  

Comments