వావ్ .. టుస్సాడ్ మ్యూజియంలో మహేష్ విగ్రహం !

Friday, April 27th, 2018, 09:36:40 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ గా ఓ అరుదైన ఘనత అందుకున్నారు. మేడం టుస్సాడ్ మ్యూజియం లో మహేష్ బాబు మైనపు విగ్రహాన్ని పెట్టనున్నారు. ఈ అరుదైన ఘనత సాధించిన రెండో హీరో మహేష్ కావడం విశేషం. ఇప్పటికే బాహుబలి తో క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ విగ్రహాన్ని పెట్టిన విషయం తెలిసిందే. తాజగా టుస్సాడ్ నుండి టెక్నీషియన్స్ వచ్చి మహేష్ కొలతలు తీసుకున్నారట. ఈ విషయాన్నీ మహేష్ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసాడు. సూపర్ స్టార్ గా టాలీవుడ్ లో తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న మహేష్ తాజాగా నటించిన భరత్ అనే నేను సంచలన విజయం అందుకుంది. ఇప్పటికే భారీ వసూళ్ల దిశగా దూసుకుపోతున్న ఈ సినిమా తరువాత మహేష్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు.

  •  
  •  
  •  
  •  

Comments