రంగస్థలం రికార్డుకు భరత్ ఎసరు?

Sunday, April 15th, 2018, 02:15:08 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో కైరా అద్వానీ హీరోయిన్ గా నటించి త్వరలో విడుదలకు సిద్ధమైన సినిమా ‘భరత్ అనే నేను’. ఈ సినిమా విడుదలకు ముందే సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఓవర్సీస్ లో 2000 థియేటర్లలో ఈ చిత్రం ప్రీమియర్ షోలను ప్రదర్శించనున్నట్టు చిత్ర బృందం పేర్కొంది. మహేష్ బాబు సీఎం క్యారెక్టర్ లో నటించిన ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. యూఎస్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మహేష్ కు ఈ సినిమా మరింత పేరు తెస్తుందని యూనిట్ అంటోంది. అయితే ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్ షోలకు టికెట్ల అమ్మకం ప్రారంభమైందని యూనిట్ వెల్లడించింది.

సినిమాకు హిట్ టాక్ వస్తే, సెకండ్ వీకెండ్ లో 3 మిలియన్ డాలర్ల వరకూ కలెక్షన్స్ వస్తాయని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా ప్రీమియర్ షోలతోనే 1.5 మిలియన్ డాలర్ల వరకూ కలెక్షన్ రావచ్చని కూడా భావిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ నాన్ బాహుబలి రికార్డు క్రియేట్ చేసిన చేసిన రంగస్థలం ప్రస్తుతం 3.5 మిలియన్ల దిశగా దూసుకెళ్తోంది. ఒక వేళ భారత్ అనే నేను కు మంచి టాక్ వస్తే రంగస్థలం పేరిట వున్నరికార్డు కేవలం రెండువారాల్లోపే బద్దలయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ సినిమా విడుదల తర్వాత ఏ మేర విజయం అందుకుంటుందో వేచి చూడాలి…..