మ‌హేష్‌తో త్రివిక్ర‌మ్‌.. అది కూడా వ‌చ్చే నెల్లోనే!

Thursday, September 29th, 2016, 08:25:30 AM IST

mahesh-trivikramm
త్రివిక్ర‌మ్ త‌దుప‌రి ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌తో సినిమా చేయ‌బోతున్నాడ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌న్నీ ఎప్ప‌ట్నుంచో కోడై కూస్తున్నాయి. త్రివిక్ర‌మ్స్క్రి స్క్రిప్టు సిద్ధం చేసే ప‌నిలోనే బిజీగా గ‌డుపుతున్నాడ‌ని చెప్పుకొన్నారు. మెగా అభిమానులంతా ‘జ‌ల్సా’,’అత్తారింటికి దారేది’ చిత్రాల త‌ర్వాత ఆ త‌ర‌హాలో మ‌రో సూప‌ర్‌హిట్టు బొమ్మ‌ని ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఆత్రుత‌గా ఎదురు చూస్తున్నారు. అయితే ఇంత‌లో ఓ న్యూస్‌. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ న‌టించ‌బోతున్నాడ‌నీ, అది కూడా షూటింగ్ అక్టోబ‌రు లోనే మొద‌ల‌వుతుంద‌ని! ఆన్‌లైన్‌లో క‌నిపించిన ఆ న్యూస్ మెగా అభిమానుల గుండెల్లో రైళ్లు ప‌రిగెత్తించింది.ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి హ్యాండిచ్చి మ‌హేష్‌తో సినిమా తీయ‌డాని కే త్రివిక్ర‌మ్సి ద్ధ‌మ‌వుతున్నాడా? అని ఆత్రుత‌గా ఆ వివ‌రాల్ని క‌నుక్కొనే ప్ర‌య‌త్నం చేశారు. చివ‌రికి వాళ్ల‌కి తెలిసిందేంటంటే…మ‌హేష్‌, త్రివిక్ర‌మ్‌లు ఓ యాడ్ కోసం సెట్స్‌పైకి వెళుతున్నార‌ని. ఓ ఆన్‌లైన్ టికెటింగ్ కంపెనీ మ‌హేష్‌తో ప్ర‌చార ఒప్పందం కుదుర్చుకుంద‌ట‌. ఆ మేర‌కు మ‌హేష్ కొన్ని యాడ్లు చేయాల్సి వుంద‌ట‌. వాటిని తెర‌కెక్కించే బాధ్య‌త‌ని త్రివిక్ర‌మ్‌పైనే పెట్టాడ‌ట మ‌హేష్‌. వాటి కోసం స్క్రిప్టు సిద్ధం చేసిన త్రివిక్ర‌మ్ అక్టోబ‌రులో షూటింగ్ మొద‌లుపెట్టేందుకు రెడీ అయిన‌ట్టు తెలిసింది. సో… ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, త్రివిక్ర‌మ్‌ల సినిమాకి మాత్రం ఢోకా ఏమీ లేద‌న్న‌మాట‌.

Comments