ఫ్యామిలీతో కలిసి విదేశాలకు మహేష్ ?

Friday, April 13th, 2018, 10:20:03 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు తను కమిట్ అయిన సినిమాను పూర్తీ చేసి ఫ్యామిలి తో కలిసి విదేశాలకు వెళ్లిరావడం మనం చూస్తున్నదే .. తాజాగా మరోసారి అయన ఫ్యామిలి తో కలిసి హాలిడేస్ కోసం విదేశాలకు పయనం అవుతున్నాడు. మహేష్ ప్రస్తుతం నటిస్తున్న భరత్ అనే నేను సినిమా షూటింగ్ పూర్తీ చేసుకుని ఈ రోజు సెన్సార్ కు కూడా వెళ్లనుంది. సో సినిమా పనులు పూర్తయ్యాయి కాబట్టి .. మహేష్ వెకేషన్ కోసం ఫారెన్ వెళుతున్నాడు ఫ్యామిలి తో కలిసి. రేపు పయనం కానున్నట్టు తెలిసింది. మళ్ళీ ఈ నెల 18న అతిరిగి వచ్చి .. భరత్ అనే నేను సినిమాకు సంబందించిన ప్రమోషన్ లో పాల్గొంటాడట. ఆ తరువాత ఈ నెల చివర్లో వంశీ పైడిపల్లి సినిమా షూటింగ్ లో జాయిన్ కానున్నాడు. మరి ఈ సారి మహేష్ ఏ దేశం వెళుతున్నాడు అన్నది తెలియాల్సి ఉంది. ఇక మహేష్ నటించిన భరత్ అనే నేను సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నెల 20 న ఈ చిత్రం విడుదల కానుంది.