లేటెస్ట్ : ‘మహేష్’ మీరు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు భేష్!

Wednesday, April 11th, 2018, 06:16:30 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లోనే కాదు నిజజీవితంలోనూ రియల్ సూపర్ స్టార్ అని చెప్పాలి. ఆయన ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు తనవంతుగా వీలయిన పలు సేవా కార్యక్రమాలు చేస్తుంటారనేది అందరికి తెలిసిన విషయమే. ఇటీవల ఆయన కొరటాల శివ దర్శకత్వంలో నటించిన సూపర్ హిట్ సినిమా శ్రీమంతుడు. ఆ సినిమా కాన్సెప్ట్ లో హీరో ఒక ఊరిని దత్తతు తీసుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి దానిని బాగు చేయడం చూసాం. అయితే మన సూపర్ స్టార్ ఆ సినిమా స్పూర్తితో ఆంధ్ర ప్రదేశ్ లో బుర్రిపాలెం, అలానే తెలంగాణాలో సిద్దాపురం గ్రామాలను దత్తతు తీసుకున్నారు.

ఇప్పటికే ఒకసారి బుర్రిపాలెం విచ్చేసిన ఆయన అక్కడ ఒక స్కూల్ నిర్మించి, మరికొన్ని కార్యక్రమాలను తన టీం తో చేయిస్తున్నారు. అలానే ఇటు సిద్దాపురం లోను చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన సతీమణి నమ్రత నేడు తన సోషల్ మీడియా ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా కొన్ని ఫోటోలు పోస్ట్ చేశారు. సిద్దాపురం లో ఒక స్కూల్, అలానే పలు బిల్డింగ్ పనులు జరుగుతున్న ఫోటోలు అవి. ఆమె పోస్ట్ చేసిన ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్గా మారాయి. మహేష్ బాబు చేస్తున్న తనవంతు సాయంపట్ల పలువురు నెటిజన్లు ఆయనకు అభినందనలు తెలియచేస్తున్నారు….

  •  
  •  
  •  
  •  

Comments