వైరల్ గా మారిన సూపర్ స్టార్ మహేష్ న్యూ లుక్!

Monday, June 11th, 2018, 10:10:13 AM IST

టాలీవుడ్ లో వున్న హాలీవుడ్ మెటీరియల్ సూపర్ స్టార్ మహేష్ బాబు అని ఎందరో ఆయనను పొగడడం మనకు తెలిసిందే. అయితే ఇటీవల విడుదలయిన గత చిత్రాలలో ఆయన తన హెయిర్ స్టైల్ విషయంలో పెద్దగా కొత్తగా ట్రై చేయలేదనే చెప్పాలి. శ్రీమంతుడు నుండి మొన్న వచ్చిన భరత్ అనే నేను వరకు ఆయన ఒకే రకమైన హెయిర్ స్టైల్ లో కనపడుతున్నారని, ప్రస్తుతం గడ్డం పెంచడం, హెయిర్ పెంచడం లేటెస్ట్ ట్రెండ్ కనుక ఆయన ఈ కొత్త ట్రెండ్ ప్రకారం ఎప్పుడు డిఫరెంట్ లుక్ లో కనిపిస్తారా అని ఆయన అభిమానులు ఎన్నాళ్ళ నుండో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇదిగో ఎట్టకేలకు సూపర్ స్టార్ నిన్న జరిగిన ఒక ఫంక్షన్ లో కొత్తగా గడ్డం, మీసం పెంచి న్యూ స్టైల్ లో కనిపించి ఫాన్స్ ని ఖుషి చేశారు. మహేష్ బాబు ని చూసిన ప్రతి ఒక్కరు అయన లుక్ అదుర్స్ అని అంటున్నారు.

ఇక ఆయన అభిమానుల సంగతైతే చెప్పనక్కర్లేదు, ఏ సోషల్ మీడియా మాధ్యమాల్లో చూసినా ఆయన న్యూ లుక్ ఫోటోలను తమ డిస్ప్లే పిక్స్ గా పెట్టుకుంటున్నారు. అంతలా వైరల్ అయింది ఆయన న్యూ లుక్. నిన్న సాయంత్రం సుధీర్ బాబు హీరోగా నటించిన సమ్మోహనం చిత్ర ఆడియో విడుదల కార్యక్రమానికి విచ్చేసిన మహేష్ బాబు ఇలా న్యూ లుక్ లో కనిపించి అందరిని థ్రిల్ చేశారు. ఇక సుధీర్ బాబు అయితే తన చిత్ర ఈ ఫంక్షన్ కి మహేష్ వస్తే చాలు అనుకుంటే, ఏకంగా ఆయన న్యూ స్టైల్ తో రావడంతో సినిమాకి తప్పక విజయం అందించినట్లవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు…..