మహేష్ 25 వ సినిమాకు దర్శకుడు ఆయనే ?

Thursday, September 22nd, 2016, 12:09:18 AM IST

mahesh-trivikramm
సూపర్ స్టార్ మహేష్ బాబు .. ఇప్పటికి ఇరవై రెండు సినిమాలు మాత్రమే చేసాడు. ”బ్రహ్మోత్సవం” అయన 22 వ సినిమా. మహేష్ హీరోగా రాజకుమారుడి(1999) తో కెరీర్ మొదలు పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఇంత తక్కువ సినిమాలు చేయడం అందరికి షాక్ ఇస్తుంది. ఇక మహేష్ ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా తరువాత మహేష్, కొరటాల శివ తో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే కొరటాల, మహేష్ సినిమా కోసం కథ సిద్ధం చేసే పనిలో పడ్డాడు. ఇక ఈ సినిమా తరువాత మహేష్ తన 25 వ ప్రతిష్టాత్మక చిత్రాన్ని త్రివిక్రమ్ తో చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడట !! మహేష్, త్రివిక్రమ్ ల కాంబినేషన్లో అతడు , ఖలేజ చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు మూడో సినిమా ఎలా ఉండనుందో మరి !! నిజానికి త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలనీ ప్లాన్ చేసాడు కానీ అది కుదిరేలా లేదు కాబట్టి .. మహెష్ తో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.