మహేష్.. భరత్ గా వచ్చే డేట్ ఫిక్స్ అయిందిగా ?

Wednesday, October 18th, 2017, 11:06:18 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న భారత్ అను నేను సినిమా షూటింగ్ మరో షెడ్యూల్ 15నుండి హైద్రాబాద్ లో వేసిన అసెంబ్లీ సెట్ లో ప్రారంభం అయింది. మహేష్ ముఖ్యమంత్రిగా కనిపించే ఈ సినిమాకు క్రేజీ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. డి వి వి ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలనీ ప్లాన్ చేసారు ..కానీ సినిమా షూటింగ్ ఇంకా చాలా మిగిలి ఉండడంతో ముందుగా అనుకున్న డేట్ ప్రకారం కాకుండా సమ్మర్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. అంటే ఈ సినిమా ఏప్రిల్ 20న విడుదల చేస్తారని తెలిసింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ ఖైదా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.

  •  
  •  
  •  
  •  

Comments