జనసేనకు, బీజేపీకి తేడా ఇదే

Friday, July 12th, 2019, 05:31:46 PM IST

అధికార వైకాపా పిరాయింపుల్ని ప్రోత్సహించకపోయినా వారికి ప్రత్యామ్నాయం తామే అంటూ, కేంద్రంలో అధికారంలో ఉన్నామని భరోసా ఇస్తూ ఇతర పార్టీల నేతల్ని భారీగా చేర్చుకుంటోంది భాజాపా. ఇది ఖచ్చితంగా స్వార్థపూరిత రాజకీయమే అవుతుంది. భాజాపా కండువా కప్పుకునేవారు ఆ పార్టీ సిద్దాంతాలు నచ్చి చేరుతున్నారా అంటే అదీ లేదు. భయపడో, ఆశపడో చేరుతున్నారు.

ఎల్లవేళలా నీతులు వల్లించే మోడీకి ఈ పిరాయింపుల పద్దతి ఎలా సవ్యమైనదో ఆయనకే తెలియాలి. ఈ సమయంలోనే ఓడినా ప్రలోభాలకు తావివ్వకుండా నడుచుకుంటున్న జనసేన తీరు ఉత్తమమైనదిగా కనిపిస్తోంది. ఇప్పటికిప్పుడు పవన్ వెంట పెద్ద నేతలు, మాజీలు నడవకపోవచ్చు. కానీ పవన్ ఒకే అని భవిష్యత్తుపై హామీ ఇస్తే మండల స్థాయి నేతలు చాలామంది ఆయనతో చేతులు కలపడానికి సిద్దంగా ఉన్నారు.

కానీ జనసేన పెట్టుకున్న నియమాల్లో పిరాయింపులు నిషేదం. వాటికి కట్టుబడే పవన్ ఇతరుల్ని ఆహ్వానించట్లేదు. కష్టాల్లో ఉన్నా సిద్దాంతాల పట్ల నిబద్దతగా వ్యవహరించడం అంటే ఇదే. ఈ పద్దతే ఆయన్ను అందరిలోకీ కొంచెం ప్రత్యేకంగా నిలబెడుతోంది.