మలైకాతో ఎఫైర్‌.. నిండా మునిగాడా?

Monday, October 8th, 2018, 02:57:40 PM IST

కెవ్వు కేక‌.. అంటూ టాలీవుడ్ న‌ట్టింట సంద‌డి చేసింది మ‌లైకా అరోరాఖాన్‌. చెలి ఛ‌య్య ఛ‌య్యా ఛ‌య్యా.. అంటూ దిల్‌సే (ప్రేమ‌తో-తెలుగు) చిత్రం నుంచి మ‌లైకా సుప‌రిచితం. అప్ప‌టినుంచి తెలుగు నాట త‌న‌కు ఫాలోయింగ్ ఉంది. గ్రేట్ డ్యాన్స‌ర్‌గా, ఐటెమ్ గాళ్‌గా యూత్‌లో ఫాలోయింగ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ న‌వ‌త‌రం హీరో అర్జున్ క‌పూర్‌తో ఎఫైర్ సాగించ‌డం అప్ప‌ట్లో చ‌ర్చ‌కొచ్చింది. టీనేజీ హీరోతో ఎఫైర్ సాగించిన ముదురు భామ‌గానూ యూత్ చెప్పుకున్నారు. అదే కార‌ణం ఆ త‌ర్వాత హీరో ఆర్భాజ్ ఖాన్ నుంచి మ‌లైకా విడిపోవ‌డానికి దారి తీసింద‌న్న ముచ్చ‌టా సాగింది.

అదంతా అటుంచితే .. అర్జున్‌తో క‌లిసి మ‌లైకా ఇప్ప‌టికీ షికార్లు చేస్తుండ‌డం బాలీవుడ్ మీడియాలో వేడి పెంచుతోంది. నిన్న‌గాక మొన్న డిజైన‌ర్ సందీప్ కోస్లా త‌న ఇంట్లో ఇచ్చిన ఓ గ్రాండ్ నైట్ పార్టీకి ఆ ఇద్ద‌రూ క‌లిసే వెళ్లారు. మ‌లైకా అరోరాఖాన్‌తో కార్‌లో వ‌చ్చిన అర్జున్ క‌పూర్ .. అక్క‌డ నానా హంగామా చేశాడు. దీంతో గ‌ప్ చుప్‌గా ఆ ఇద్ద‌రూ ఎఫైర్ సాగించేస్తున్నార‌ని మ‌రోసారి ప్ర‌చారం ఊపందుకుంది. మ‌రోవైపు ఆర్భాజ్ ఖాన్ విడాకులిచ్చాక‌.. మ‌రో కొత్త‌మ్మాయ్‌తో చెట్టాప‌ట్టాల్ అంటూ తిరిగేయ‌డం మీడియాలో ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కొచ్చింది.