మహేష్ భార్య పై బాలీవుడ్ బ్యూటి షాకింగ్ కామెంట్స్!

Friday, February 23rd, 2018, 12:59:57 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ ఫ్యామిలీ ఎంత సింపుల్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎక్కువగా వివాదస్పద విషయాల దగ్గరికి పోకుండా ఆ కుటుంబం చాలా హ్యాపీగా ఉంటుంది. అయితే ఎవరు ఊహించని విధంగా రీసెంట్ గా మహేష్ ఫ్యామిలీపై ఒక హాట్ బ్యూటీ కామెంట్ చేసింది. మహేష్ సతీమణి నమ్రత పై వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా ఎవరో అందరికి తెలిసిన విషయమే.

అయితే మలైకా ఇటీవల నేహా ధూపియా నిర్వహిస్తున్న ‘వోగ్ బీఎఫ్ఎఫ్’ కార్యక్రమనికి స్పెషల్ గెస్ట్ గా వెళ్లింది. అందులో మోడలింగ్ రంగంలో తనకు ఎదురైనా కొన్ని అనువబావాలను చెప్పుకుంది. అందులో భాగంగానే నమ్రతా గురించి కూడా చెప్పింది. నేను మోడలింగ్ ప్రపంచంలో ఉన్నప్పుడు నమ్రత నాకంటే సీనియర్ అండ్ టాప్ మోడల్. ఆమెతో పాటు మెహర్ జెస్సియా కూడా ఉండేది. అయితే అప్పుడు నేను జూనియర్ గా ఉండడం వల్ల నాపై కొంచెం దురుసుగా ప్రవర్తించేవారు. చాలా పొగరుగా ఉండేవారని చెప్పడంతో అందరూ చెక్ అయ్యారు. అయితే అప్పట్లో అవన్నీ కామన్ అంటూ.. ఇప్పుడు వారితో చాలా ఫ్రెండ్లి గా ఉంటాను అని చివర్లో అందరిని కూల్ చేసింది.