కళ్లతో రొమాన్స్ చేస్తోన్న ఆ పిల్ల ఎవరో తెలుసా?

Monday, February 12th, 2018, 02:31:34 PM IST

సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతోన్న కొంతమంది మోడల్స్ అందం మొదటి చూపుల్లోనే అందరికి బాగా కనెక్ట్ అవుతోంది. గత పదేళ్లకు ముందు స్టార్ హీరోయిన్స్ గా గుర్తింపు పొందాలంటే ఓ నాలుగైదు స్టార్ హీరోల సినిమాలు తగిలితే గాని ఇమేజ్ వచ్చేది కాదు. కానీ ఈ రోజుల్లో రిజల్ట్ తో సంబంధం లేకుండా చాలా మంది హీరోయిన్స్ ఫస్ట్ లుక్ లొనే కనెక్ట్ అయిపోతున్నారు. అందుకు సోషల్ మీడియా వారి కెరీర్ కు మంచి బూస్ట్ ఇస్తోంది.

ఇక అసలు విషయానికి వస్తే ట్విట్టర్ – ఫెస్ బుక్ – ఇన్స్టాగ్రామ్ అలాగే వాట్సాప్ లలో ఈ మధ్య ఓ క్లిప్ చాలా పాపులర్ అవుతోంది. కనుసైగలతో ఓ అందమైన యువతి రొమాన్స్ చేయడం అందరికి కనెక్ట్ అయ్యేలా చేస్తోంది. దానికి తోడు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా పలు రకాలుగా వినిపిస్తూ వైరల్ అవుతోంది. మొదట ఈ వీడియో ను చూసి చాలా మంది ఎదో షార్ట్ ఫిల్మ్ అనుకున్నారు. కానీ అది నిజం కాదు. అయితే ఆ యువతి ఎవరో తెలుసుకోవాలని ఉందా..?

అయితే పదండి తెలుసుకుందాం.. ఆమె పూర్తి పేరు ప్రియా ప్రకాష్ వారియర్. ఈ క్లిప్ తన మొదటి సినిమాలోనిది. కేరళకు చెందిన ఈ బ్యూటీ మోడల్ ప్రపంచంలో ఇప్పుడిపుడే అడుగులు వేస్తోంది. స్టడీ విషయానికి వస్తే బి.కామ్ ఫస్ట్ ఇయర్ చేస్తోంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ప్రియా క్రేజ్ బాగానే అందుకుంటోంది. ఫాలోవర్స్ సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతోంది. ఇన్స్టాగ్రామ్ లో ఆమెకు 286k ఫాలోవర్స్ ఉన్నారు. ఇక ఆ క్లిప్ విషయానికొస్తే ‘ఓరు ఆధార్ లవ్’ అనే మలయాళం సినిమాలోనిది. రీసెంట్ గా షూటింగ్ కుడా పూర్తయ్యింది. సినిమా ప్రమోషన్ లో భాగంగా చిత్ర యూనిట్ ఆ వీడియోను సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేయగా మంచి క్రేజ్ వచ్చింది. ఒమర్ లులు దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా మార్చ్ 3న రిలీజ్ కాబోతోంది.