ఆ విమానం దారి తప్పింది.. కాని ..!

Monday, December 28th, 2015, 05:21:04 PM IST

మలేషియా కు చెందిన ఓ విమానం దారి తప్పింది. మలేషియన్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఎంహెచ్ 132 నెంబర్ గల విమానం న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ నుంచి కౌలాలంపూర్ కు బయలు దేరింది. అయితే, అలా బయలుదేరిన తరువాత ఆ విమానం ప్రయాణించవలసిన రూట్ లో కాకుండా.. వేరే రూట్ లోకి వెళ్ళిపోయింది. అయితే, జరిగిన పొరపాటును గుర్తించిన ఫైలట్ వెంటనే అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అధికారులు ఫ్లైట్ ను తిరిగి సరైనా మార్గంలో ప్రయాణించడానికి తగిన సూచనలు సలహాలు ఇచ్చారట. ఎలాగైతెనం ఆ ఫ్లైట్ తిరిగి దారిలోకి వచ్చింది. సరైన మార్గంలో ప్రయాణించి ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చింది. మలేషియన్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం దారి తప్పిన విషయాన్ని ఆ సంస్థ అధికారులే అధికారికంగా ప్రకటించారు. కాని, చివరకు సురక్షితంగా చేరడంతో.. అంతా ఊపిరి పీల్చుకున్నారు. గతంలో ఇదే ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం దారి తప్పిమాయమైన సంగతి తెలిసిందే.