మ‌లేషియా `స్టార్ నైట్‌` హ‌డావుడి చూశారా?

Saturday, January 6th, 2018, 09:00:43 PM IST

సౌతిండియా ఆర్టిస్టుల సంఘం `న‌డిగ‌ర‌సంఘం` ఆర్టిస్టుల భ‌వంతి కోసం, పేద క‌ళాకారుల సంక్షేమ నిధిని ఏర్పాటు చేయ‌డం కోసం ప్ర‌త్యేకించి మ‌లేషియాలో `స్టార్‌నైట్‌` కార్య‌క్ర‌మం ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ శ‌నివారం ఉద‌యం 11 గంట‌ల నుంచి మ‌లేషియా కౌలాలంపూర్‌లో సంద‌డి మొద‌లైంది. దాదాపు 300 మంది ఆర్టిస్టులు ఈ స్టార్‌నైట్ కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు మ‌లేషియా వెళ్ల‌డం విశేషం. ఇక ఈ వేడుక‌ల వేళ‌ మ‌లేషియా రంగులు ప‌రుచుకుంది. కౌలాలంపూర్ (మ‌లేషియా) బుకిత్ జ‌లీల్ నేష‌న‌ల్ స్టేడియంలో నిర్వ‌హిస్తున్న స్టార్ నైట్ కార్య‌క్ర‌మంలో స్టార్లంతా సంద‌డి సంద‌డి చేస్తున్నారు.

ఉద‌యం నుంచి క్రికెట్ మ్యాచ్‌లు.. స్కిట్‌లు.. హోరెత్తిపోతున్నాయ్‌. అంత‌కుమించి న‌క్ష‌త్ర విజ‌న్‌ 2018 పేరుతో బోలెడ‌న్ని కార్య‌క్ర‌మాలు చేశారు. ఈ వేడుక‌ల్లో సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌, ఉల‌గ‌నాయ‌గ‌న్ క‌మ‌ల్‌హాస‌న్‌, నాజ‌ర్‌, కార్తీ, విశాల్ త‌దిత‌రులు పాల్గొన్నారు. ఆర్టిస్టులు, క‌థానాయిక‌లు పెద్ద ఎత్తున వేడుక‌లో పాలుపంచుకున్నారు. స్టార్‌నైట్ వివ‌రాల్ని ఆర్టిస్టులు అధికారికంగా ట్విట్ట‌ర్‌లో అభిమానుల‌తో షేర్ చేసుకుంటున్నారు.