మ‌ల్లూ అర్జున్ తాట తీశాడు పో!

Saturday, May 19th, 2018, 10:55:50 PM IST

అల్లు అర్జున్ మ‌ల్లూ అర్జున్ గా ఎలా ప్ర‌మోట‌య్యాడో చెప్ప‌గ‌ల‌రా? ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం కావాలంటే .. కాస్త అత‌డి ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లాలి. అల్లు అర్జున్ కాస్తా మ‌ల్లూ అర్జున్‌గా ఎద‌గ‌డం వెన‌క చాలానే క‌థ ఉంది. అత‌డు న‌టించిన ఆర్య‌, ఆర్య‌2 చిత్రాలు మాలీవుడ్‌లో బంప‌ర్ హిట్లు. ఆ రెండు సినిమాలు అత‌డికి మాలీవుడ్‌లో అసాధార‌ణ ఫాలోయింగ్‌నే తెచ్చి పెట్టాయి. స‌రిగ్గా ఇప్పుడ‌దే నా పేరు సూర్య మ‌ల‌యాళ వెర్ష‌న్ ఘ‌న‌విజ‌యం సాధించ‌డానికి సాయ‌మ‌య్యాయి. అంతేనా మ‌ల‌యాళంలో మొన్న ఎన్‌పీఎస్ రిలీజ్ వేళ ఓ లేడీ రివ్యూ రైట‌ర్ రాసిన రివ్యూ చ‌దివిన అభిమాని ఏకంగా రేప్ చేస్తాన‌నే వార్నింగ్ ఇచ్చాడు. ఆ గంద‌ర‌గోళం న‌డుమ ఈ సినిమా మాలీవుడ్‌లో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కొట్టిందన్న రిపోర్ట్ అందింది.

టాలీవుడ్‌లో డిజాస్ట‌ర్ రిజ‌ల్ట్ అందుకున్న నా పేరు సూర్య‌ మాలీవుడ్‌లో `ఎంటె పేరు సూర్య ఎంటె వీడు ఇండియా` పేరుతో రిలీజైంది. అక్క‌డ బంప‌ర్ హిట్. బ‌న్ని కెరీర్ బెస్ట్ మూవీ ఇన్నాళ్లు యోధ‌వు (స‌రైనోడు) 7.65కోట్లు వ‌సూలు చేసింది. ఈ రికార్డును కేవ‌లం తొలి వారంలోనే ఎన్‌పీఎస్ మ‌ల‌యాళీ వెర్ష‌న్‌ బ్రేక్ చేసేస్తోంది. ఇప్ప‌టికే 5.5కోట్ల వ‌సూళ్లు సాధించింది. ఈ వారంలోనే రికార్డ్ బ్రేక్ చేసి స‌త్తా చాట‌నుందిట‌.

  •  
  •  
  •  
  •  

Comments