నందిగ్రమ్ కౌంటింగ్ పై మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు!

Monday, May 3rd, 2021, 06:09:05 PM IST


పశ్చిమ బెంగాల్ లో ఊహించని రీతిలో భారీ విజయం దక్కించుకున్నారు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. అయితే పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ నందిగ్రం నియోజక వర్గం కౌంటింగ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఓట్ల లెక్కింపు ప్రక్రియ లో పలు సందేహాలు ఉన్నాయి అని అనుమానం వ్యక్తం చేశారు. అయితే నాలుగు గంటల పాటు సర్వర్ లో సమస్య ఉందని ఎలక్షన్ కమిషనర్ చెప్పిన విషయాన్ని వెల్లడించారు. అయితే తాను గెలిచినట్లు తెలిసి గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు అని మమతా బెనర్జీ గుర్తు చేసుకున్నారు. అయితే రీ కౌంటింగ్ కి అనుమతి ఇవ్వొద్దు అని ఆర్వో ను బెదిరించారు అని వ్యాఖ్యానించారు. అయితే రీ కౌంటింగ్ నిర్వహిస్తే ఆర్వో కి ప్రాణాపాయం ఉందని అన్నట్లు తనకు తెలిసింది అని చెప్పుకొచ్చారు. అయితే ఆర్వో లేఖ రాసిన విషయం తనకు ఒకరు ఎస్ఎంఎస్ ద్వారా పంపారు అంటూ మమతా బెనర్జీ చెప్పుకొచ్చారు. అయితే పార్టీ విజయం సాధించడం తో నేడు గవర్నర్ ను కలవనున్నారు మమతా బెనర్జీ.