ప్రేమ శాపంగా మారిన వేళ..వనస్థలిపురం లో యువకుడి దారుణ హత్య !

Thursday, September 29th, 2016, 03:22:46 PM IST

prema
ప్రేమ వ్యవహారాలు ఎంతటి దారుణాలకి దారి తీస్తాయి అనేది చూస్తూనే ఉన్నాం. మొన్నామధ్య చెన్నయ్ లో స్వాతి అనే ఉద్యోగిని రైల్వే స్టేషన్ లో చంపేసిన దుర్మార్గుడి ఉదంతం మరవక ముందరే ఈ మధ్యనే ఎన్నో దారుణాలు చూస్తున్నాం. డిల్లీ లో పట్టపగలు ఇరవై పోట్లతో కత్తితో పొడిచిన ఉన్మాది వెనకాల ప్రేమ వ్యవహారం కారణం అని మీడియా చెబుతూనే ఉంది. ఇవన్నీ మర్చిపోక ముందరే హైదరాబాద్ లో ఒక యువకుడు దారుణ హత్యకి గురయ్యాడు. లలిత్ ఆదిత్య అనే కుర్రాడు స్థానిక సచివాలయ నగర్ లో ప్రైవేటు జాబ్ చేస్తున్నాడు. ఇవాళ తెల్లవారు జామున కారులో ఒచ్చిన కొందరు దుర్మారుగులు అతన్ని కత్తులతో గట్టిగట్టిగా పొడిచి హత్య చేసారు. ఎనిమిది నెలల క్రితం సుస్మితా రెడ్డి అనే వ్యక్తిని ఇతగాడు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రేమ విషయంలో బాగానే ఉన్న వీరిద్దరూ పెళ్లి తరవాత మాత్రం సరిగ్గా ఉండలేక పోయారు. పెళ్ళయిన కొన్ని రోజులకే లలిత్ తో గొడవపడి సుస్మిత ఇంటికి వెళ్ళిపోయింది. ఇలాంటి పరిస్థితి లో లలిత్ హత్య జరగడం సంచలనంగా మారింది. ఆయన హత్యకు ప్రేమ వివాహమే కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. యువకుడిని హత్య చేసిన అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments