ఒంటరిగా బయటకొచ్చిందని తల నరికేశారు..

Wednesday, December 28th, 2016, 06:07:13 PM IST

shadepic
ఆఫ్గనిస్తాన్ లో పరిస్థితులు రోజురోజుకూ దిగజారి పోతున్నాయి. తాలిబన్ల ఉగ్రవాదులు ఆ దేశంలో రోజురోజుకూ పేట్రేగిపోతున్నారు. తాలిబన్ల నిబంధన ప్రకారం అక్కడ ఏ మహిళా ఒంటరిగా బయటకు రాకూడదు. ఒకవేళ భర్త లేకపోతే కనీసం దగ్గరి బంధువునైనా తోడు తీసుకెళ్లాలి. అంతేకాదు మహిళలు చదువుకోకూడదు, పని చేయకూడదు, తప్పనిసరిగా బురఖా ధరించాలి. డిసెంబర్ మొదటి వారంలో అయిదుగురు అమ్మాయిలు ఎయిర్ పోర్ట్ లో పని చేస్తున్నారని తెలుసుకుని ఇద్దరు ఉగ్రవాదులు ద్విచక్ర వాహనంపై వచ్చి ఆ అమ్మాయిలు ప్రయాణిస్తున్న వాహనంపై కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో అయిదుగురు యువతులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి అక్కడ జరిగింది.

సర్ ఇ ఫుల్ రాష్ట్రంలో లట్టి అనే గ్రామం చాలా వెనుకబడి ఉంది. ఈ గ్రామం తాలిబన్ల ఆధీనంలో ఉంది. గ్రామంలో ఎవరు ఏం చేసినా వీళ్లకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఒక మహిళ (30) పలు వస్తువులు కొనేందుకు పట్టణానికి వచ్చింది. భర్తతో కలిసి రాకుండా ఒంటరిగా వచ్చినందుకు ఆమెను తాలిబన్ ఉగ్రవాదులు అత్యంత దారుణంగా నరికి చంపారు. ఆమె తలను మొండెం నుండి వేరు చేశారు. ఈ సంఘటనపై అక్కడి గవర్నర్ ప్రతినిధి మాట్లాడుతూ.. భర్త లేకుండా ఒంటరిగా వచ్చినందుకు ఉగ్రవాదులు ఆమెను హతమార్చారని, ఆమె భర్త ఇరాక్ లో ఉన్న కారణంగా ఆమె ఒంటరిగా రావాల్సి వచ్చిందని అన్నారు.

  •  
  •  
  •  
  •  

Comments