నరకపు హోల్ లో పడి బయట పడ్డాడు.. కాదు..కాదు..మాన్ హోల్ లో పడి ..!!

Friday, September 23rd, 2016, 06:15:48 PM IST

rain
హైదరాబాద్ లోని నాచారం లో ఓ వ్యక్తి పొంగి ప్రవహిస్తున్న మాన్ హోల్ లో పడి కొట్టుకుని పోయాడు.అందరు చూస్తుండగానే ఈ ఘటన జరిగింది. హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలతో రోడ్ లన్ని అస్తవ్యస్తంగా మారాయి. వాహనదారులకు నరకం చూపిస్తున్నాయి.హైదరాబాద్ లోని నాచారంలో ఓ టెంపో మాన్ హోల్ లో దిగబడి పోయింది. దీనితో అక్కడ ఉన్నవారు దానిని బయటకు తీసే ప్రయత్నం చేశారు. ఈ క్రమం లో ఓ యువకుడు వారికి సాయం సాయం చేయబోయి మాన్ హోల్ లో పది కొట్టుకుపోయాడు. ఆ ప్రాంతం మొత్తం నీటితో నిండిఉండడంతో ఎక్కడ ఏముందో తెలియలేదు. దీనితో పొరపాటున ఆ యువకుడు మాన్ హోల్ లో పడి కొట్టుకుపోయాడు. అతడి కోసం ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు గాలింపులు మొదలుపెట్టాయి. చివరికి అతి కష్టం మీద అతడిని గుర్తించి ఆసుపత్రికి తరలించారు.ప్రస్తుతం ఆ యువకుడు క్షేమంగా ఉన్నాడు.