పాపం బెట్టింగ్ లో ఓడిపోయి ప్రాణాలు తీసుకున్నాడు…

Sunday, June 9th, 2019, 11:20:46 AM IST

పశ్చిమ గోదావరి జిల్లా, తణుకు ప్రాంతానికి చెందిన ఒక 30 సంవత్సరాలకు చెందిన ఒక యువకుడు, తాను కాసిన బెట్టింగ్ లో ఓడిపోయి ఆత్మహత్యకు పాల్పడ్డాడు… పోలీసుల వివరాల ప్రకారం ఇంటూరి సందీప్ అనే యువకుడు ఏపీలో జరిగిన ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ గెలుస్తుందని లక్ష రూపాయలు బెట్టింగ్ కట్టాడు. కాగా ఏపీలో జరిగిన ఎన్నికల ఫలితాలలో టీడీపీ దారుణంగా ఓడిపోవడంతో ఈ సందీప్ అనే వ్యక్తి పొలాలలో పురుగులకు వేసే మందుని తాగి ఆత్మహత్యకి పాల్పడ్డాడు… తక్షణమే స్పందించిన తన కుటుంబ సభ్యులు దగ్గరలోనే ఒక ప్రయివేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతానికి అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. అయితే పోలీసులు సేకరించిన వివరాల ప్రకారం సందీప్ అనే వ్యక్తి ఏపీలో తెలుగు దేశం పార్టీ గెలుస్తుందని 50 లక్షలు బెట్టింగ్ పెట్టాడని, కానీ ఏపీలో టీడీపీ ఓడిపోవడంతో తానూ చెల్లించాల్సిన మొత్తం డబ్బులో 20 లక్షలు మాత్రమే చెల్లించాడని, మిగతా మొత్తం చెల్లించలేక ఇలా ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలుపుతున్నారు…