నేను రౌడీని నన్ను అరస్ట్ చెయ్యండి .. పోలీస్ స్టేషన్ కి వచ్చి గోల చేస్తున్నాడు

Wednesday, November 2nd, 2016, 03:08:20 PM IST

shado
రాత్రి పదిన్నర సమయం లో పోలీసులకి చెమటలు పట్టించాడు ఒక వ్యక్తి. తమిళనాడు లోని ఎగ్మోర్ పోలీస్ స్టేషన్ కి వచ్చిన ఒక వ్యక్తి చెప్పిన మాటలు విని పోలీసులు భలే షాక్ అయ్యారు. తానో పేరుమోసిన రౌడీనని, తనను అరెస్ట్ చేయాలని వేడుకున్నాడు. దీంతో అతడు జోక్ చేస్తున్నాడని, తాగిన మత్తులో ఏదోదో మాట్లాడుతున్నాడని పోలీసులు భావించారు. స్టార్ కమెడియన్ వడివేలు అభిమాని అయి ఉంటాడని అనుకుని అతడి మాటలను నమ్మలేదు. కానీ దీపావళి నాడు జరిగిన ముగ్గురు యువకుల హత్య తానే చేసాను అని అతను చెప్పడం తో పోలీసులు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని పేరు సంతోష్ కుమార్ అని గుర్తించారు వారు. సంతోష్ కుమార్ అలియాస్ నందు కూవమ్ నదీ ఒడ్డున కుటుంబ సభ్యులతో కలిసి ఉంటూ చేపలు బండి నడుపుతూ జీవిస్తున్నట్టు పోలీసులు నిర్ధారించారు. తాగిన మత్తులోనే అతడు తానో రౌడీనని చెబుతున్నట్టు అనుమానిస్తున్నారు. అయితే ప్రస్తుతం అతడిని విడిచిపెట్టేది లేదని, ముగ్గురు హత్యలకు, ఇతడికి ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.