రియ‌ల్ వండ‌ర్‌: భారీ కొండ చిలువ మింగేసినా.. బ‌తికి బ‌య‌టికొచ్చాడు!

Sunday, November 20th, 2016, 06:53:44 PM IST

python
పాతిక అడుగుల కొండ చిలువ నోట్లో ఓ మ‌నిషి చిక్కుకుని గిల గిలా త‌న్నుకుంటే చూసేవాల్ల‌కు గుండెలు అద‌ర‌వూ? కానీ అద‌ర‌గ‌క బెడ‌ర‌క చూశారు వాళ్లు! ఇంత‌కీ ఆ క‌ర్క‌శులు ఎవ‌రు?

ఇంకా బ‌తికి ఉన్న మ‌నిషి.. మొండెం అంతా కొండ‌చిలువ‌ నోట్లోకి వెళ్లిపోయింది. కాళ్లు మాత్ర‌మే భ‌య‌టికి క‌నిపిస్తున్నాయ్‌. గిల గిలా కొట్టుకోవ‌డం క‌నిపిస్తోంది. అది చూస్తున్న వారికి ఏమ‌నిపిస్తుంది? క‌నీసం ర‌క్షించే ప్ర‌య‌త్నం చేయాల‌నిపించ‌దూ? కానీ అక్క‌డ వాళ్లెవ‌రూ ర‌క్షించ‌లేదు. పైగా అదంతా షూటింగ్ చేస్తూ బిజీగా ఉన్నారు. పైగా కొండ‌చిలువ మూవ్‌మెంట్ ని కాప్చుర్ చేసే కెమెరాలు పెట్టారు. ఆ కెమెరాలో కొండ చిలువ ప్ర‌తి ఎమోష‌న్‌ని కాప్చుర్ చేయ‌డం వాళ్ల ప‌ని. అంతేనా .. అస‌లు కొండ చిలువ తెగువ‌, బ‌లం ఏ రేంజులో ఉంటుందో చూపించేలా గ్రాఫ్ క‌ళ్ల‌ముందు బుల్లితెర‌పై క‌నిపిస్తుంటుంది.

ఆ స‌న్నివేశంలో కొండ చిలువ ప్ర‌య‌త్నంతో పాటు ఇక్క‌డ మ‌నుషుల్లో ఎమోష‌న్స్ ఉబికిపోతుంటాయ్‌. ఎంత‌టి డేరింగ్ ఫీట్ ఇది. కానీ ఇది ఓ టీవీ చానెల్‌లో లైవ్ చేసింది. అక్క‌డ కొండ‌చిలువ నోట్లో చిక్కుకున్న‌ది రియ‌ల్ మ‌నిషే. గిజ‌గిజా కొట్టుకుంటూ టెన్ష‌న్ పెంచ‌డ‌మే కాదు టీవీ చానెల్‌ టీఆర్‌పీని పెంచేస్తాడు. ఇదేదో రొటీన్ రియాలిటీ షో కాదు. రొటీన్‌కి భిన్నంగా సాగే వైల్డ్ లైఫ్ రియాలిటీ షో. ఈ షో ఈ శ‌నివారం రాత్రి టెలీకాస్ట్ అయ్యింది యానిమ‌ల్ ప్లానెట్ చానెల్లో. ఇంట్రెస్టింగా ట్విస్టేమంటే.. కొండ‌చిలువ నోట్లో చిక్కుకున్న మ‌నిషికి ఏమీ కాల‌దు. అతడు బ‌తికే ఉన్నాడు. అదెలాగంటే .. అత‌డు హెడ్‌కి ర‌క‌ర‌కాల తొడుగులు తొడిగాడు. మొండేనికి పైన ఓ ఐరన్ యంత్ర ప‌రిక‌రాన్ని అమ‌ర్చుకున్నాడు. అది కొండ చిలువ బ‌లానికి అద‌ర‌ని బెద‌రని ఏమాత్రం కింగ‌ని ప‌రిక‌రం అన్న‌మాట‌! త‌న ఆహారాన్ని బుజించేప్పుడు, ఒళ్లు విరుచుకునేప్పుడు ఆ కొండ చిలువ ప్ర‌యోగించే బ‌లం ఎంతో ఆ ప‌రిక‌రం ద్వారానే రికార్డ‌వుతుంది. కొండ చిలువ ఎమోష‌న్‌ని కాప్చుర్ చేసే ప్ర‌యోగ‌మే ఈ రియాలిటీ లైవ్ షో ఉద్దేశం. బావుంది కదూ? ఇలాంటి రేర్ టీవీ షోస్ మిస్ కాకుండా చూసి తీరాల్సిందే. బ‌హుశా ఆ ఎపిసోడ్ యూట్యూబ్‌లో దొరుకుతుందేమో వెతికి చూడండి. మీరు కూడా గుండెలు ఉగ్గ‌బ‌ట్టి చూస్తూ టెన్ష‌న్‌కు లోన‌వ్వండి.