టీజర్ : మర్డర్ మిస్టరీలో మంచు లక్ష్మి..

Saturday, April 28th, 2018, 06:56:28 PM IST

మంచు వార‌మ్మాయి, మోహన్ బాబు ముద్దుల కూతురు, ల‌క్ష్మీ ఇటు టీవీ తెరపైన, అటు వెండితెర‌పైన తన పర్ఫార్మెన్స్ చూపిస్తూ సందడి చేస్తున్న సంగ‌తి విదితమే. కెరీర్‌లో చేసే ప్రతీ సినిమాలో ఒక వైవిధ్య‌మైన పాత్ర‌లు పోషించిన మంచు ల‌క్ష్మీ ప్ర‌స్తుతం మ‌ర్డర్ మిస్ట‌రీకి సంబంధించిన చిత్రం చేస్తు సినీ అభిమానుల ముందుకు రాబోతుంది. W/0 రామ్ పేరుతో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ఆద‌ర్శ్ బాల‌కృష్ణ‌, ప్రియ‌ద‌ర్శి ముఖ్య‌మైన పాత్ర‌లు పోషించడం విశేషకరం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ .. మంచు ఎంటర్టైన్మెంట్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకి, విజయ్ యలకంటి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా ఈ చిత్ర టీజ‌ర్‌ని సీనియర్ నటుడు కింగ్ నాగార్జున విడుద‌ల చేసారు. టీజ‌ర్‌ని బ‌ట్టి చూస్తుంటే ఈ మూవీలో మంచు ల‌క్ష్మీ మ‌రోసారి త‌న న‌ట‌న‌తో మంచు అభిమానులనే కాకుండా ప్రతీ సినీ అభిమానుల్ని కూడా మెప్పించేలా క‌నిపిస్తుంది. మ‌రి రీసెంట్‌గా విడుద‌లైన టీజ‌ర్‌పై మీరు ఓ లుక్కేయండి.

  •  
  •  
  •  
  •  

Comments