మంచు మనోజ్ ను కించపరిచేలా మాట్లాడిన ఫాలోవర్.!

Tuesday, September 25th, 2018, 11:32:13 AM IST

గత కొంత కాలంగా మంచి విజయం లేదు,కానీ తాను ఎప్పుడు సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ తన అభిమానులు,ఫాలోవర్స్ తో సరదాగా టచ్ లోనే ఉంటాడు,వారు ఏ విధంగా వారిని కామెంట్ చేసినా దానికి సున్నితంగానే సమాధానం ఇస్తుంటాడు,అంతే కానీ ఎప్పుడు వారు బాధ పడేలా సమాధానం ఇవ్వలేదు,అంతే కాకుండా సమాజంలో ఏ తప్పు జరిగినా తాను ఎప్పుడు ముందుగానే స్పందిస్తుంటాడు.తన స్నేహితులకు కష్ట కాలంలో ఉన్నపుడు కూడా తాను తోడున్నా అంటూ భరోసా ఇస్తాడు.

కానీ ఈ రోజు మనోజ్ ఎప్పటిలాగానే తన అభిమానులకు శుభోదయం తెలిపి అందరు బాగుండాలి అన్నట్టుగానే ట్వీట్ పెట్టాడు.కానీ అందులో ఏం తప్పు కనిపించిందో కానీ అతని ఫాలోవర్ లో ఒకరు మంచు మనోజ్ యొక్క మనోభావాలని కాస్త కించపరిచేలా రిప్లై ఇచ్చాడు.మనోజ్ పెట్టిన ట్వీట్ కు గాను “ఏ పని చేయకుండా నాన్నలు సంపాదించిన డబ్బుతో ఎంజాయ్ చేస్తున్నావు,జీవితం అంటే నీది యువతకి ఆదర్శంగా నిలుస్తున్నావు”. అంటూ రిప్లై ఇచ్చాడు.దీనితో ఇతర అభిమానులు మండిపడుతున్నారు.ఏది ఏమైనా ఇది కాస్త బాధ కలిగించే విషయమే అని చెప్పాలి,దీనికి మంచు మనోజ్ ఎలా తన స్పందనని తెలియజేస్తారో వేచి చూడాలి.