విడాకుల రూమర్ పై స్పందించిన మనోజ్ ?

Saturday, June 9th, 2018, 12:44:22 AM IST

మంచు మనోజ్ తన భార్య ప్రణతికి మధ్య విభేదాలు వచ్చాయని, వారు తీసుకునేందుకు సిద్దమయ్యారంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయం పై మనోజ్ క్లారిటీ ఇచ్చాడు. తాజాగా అయన ట్విట్టర్ లో ఈ విషయం పై స్పందించాడు. పైగా అయన అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం కూడా చెప్పాడు. విడాకుల గురించి స్పందిస్తూ ప్రణతి నేను విడాకులు తీసుకుంటున్నట్టు వస్తున్న వార్తలు అబద్దం .. వాళ్ళ బొంద అందులో ఎలాంటి నిజం లేదు .. ప్రణతి నా దేవత అంటూ సమాధానం చెప్పాడు. అనవసరమైన రూమర్స్ ని నమ్మకూడదని అయన చెప్పాడు. మంచు మనోజ్ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నాడు.