మాట జారిన మనోజ్ !

Monday, January 29th, 2018, 05:56:14 PM IST

మంచు మోహన్ బాబు నటించిన నూతన చిత్రం గాయత్రి. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం నిన్న హైదరాబాద్ లో వైభవంగా జరిగింది. సాధారణం గా ప్రతి ఆడియో ఫంక్షన్ లోను ఆ చిత్ర నటీనటుల పై పొగడ్తలు మామూలే. అలానే నిన్న జరిగిన గాయత్రి ఆడియో ఫంక్షన్ లో మోహన్ బాబు గొప్పతనం గురించి ఆయన వారసులు చాలా బాగా చెప్పారు. ముఖ్యంగా మంచు మనోజ్ మాట్లాడుతూ మోహన్ బాబు బాగా నటించారని, ఇప్పటితరం హీరోలకు ఆయన ఏమాత్రం తీసిపోని విధంగా ఫైట్లు చేశారన్నారు. కథ ఇంతవరకు బాగున్నా కొంత సేపటికి చిత్రం లో నటించిన శ్రీయ గురించి మాట్లాడుతూ తన ఫేవరెట్ హీరోయిన్ శ్రీయ అని, ఈ సినిమాలో చాలా హాట్ గా, సూపర్ గా ఉందని కామెంట్స్ చేసాడు. అయితే మనోజ్ మాటలకు ఒక్క క్షణం అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. తరువాత కొందరు వెనుకనుండి అరవడంతో వెను వెంటనే ఆయన నాపైన నేను బిస్కట్ వేసుకుంటున్నా అనడం తో అక్కడున్నవారికి కొంత ఇబ్బందిగా అనిపించింది అంటున్నారు. మదన్ దర్శకత్వంలో మోహన్ బాబు, శ్రీయ నటిస్తున్న ఈ చిత్రంలో విష్ణు కూడా ఒక పాత్ర చేస్తున్నారు. ఎస్.ఎస్ థమన్ మ్యూజిక్ అందించారు….