`ఫిలింన‌గ‌ర్ దైవ‌స‌న్నిధానం` కేరాఫ్ ఎంబీ ?

Monday, January 22nd, 2018, 05:16:53 PM IST

హైద‌రాబాద్ ఫిలింన‌గ‌ర్ దైవ‌స‌న్నిధానం ప్ర‌త్యేక‌త ఏంటో ఎవ‌రికైనా తెలుసా? ఇలా అడిగారేంటి? అంద‌రికీ తెలుసు క‌దా? అని సందేహం వ్య‌క్తం చేయొద్దు. ఎందుకంటే ఫిలింన‌గ‌ర్ దైవ‌స‌న్నిధానం విశిష్ట‌త కేవ‌లం టాలీవుడ్ జ‌నాల‌కు, ఆ చుట్టుప‌క్క‌ల ప‌రిస‌రాల్లో ఉన్న‌వాళ్ల‌కు మాత్ర‌మే తెలుసు. అయితే ఈ దైవ‌స‌న్నిధానం దేశంలోనే ది బెస్ట్ టెంపుల్స్‌లో ఒక‌టి అన్న సంగ‌తి ఒక‌సారి విజిట్ చేసిన వారికే అవ‌గ‌త‌మ‌వుతుంది. అంత‌టి ప్ర‌త్యేక‌త ఉన్న దేవాల‌యం ఇది. ఇక ఈ దేవ‌స్థానంలో నిరంతరం పూజ‌లుపున‌స్కారాలు, వృతాలు ధేధీప్య‌మానంగా సాగుతుంటాయి. ఇందులో టాలీవుడ్ రిచెస్ట్ సెల‌బ్రిటీలంతా వేకువ ఝామున పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తుంటారు. ముఖ్య‌మైన పండ‌గ‌ల వేళ ఇక్క‌డ కొలువై ఉన్న ముక్కోటి దేవ‌త‌ల్ని సంద‌ర్శిస్తుంటారు. ఈ దేవ‌స్థానంలో అందుబాటులో లేని దేవుడు లేడంటే న‌మ్మండి. అంత‌టి విశిష్ఠ‌త ఉన్న ఈ దేవ‌స్థానానికి స్థాయికి త‌గ్గ గుర్తింపు రాలేద‌న్న‌ది జ‌గద్విదితం. ఇక ఈ దైవ‌స‌న్నిధానం వెన‌క ఓ భారీ ట్ర‌స్ట్ వ‌ర్క్ చేస్తోందన్న సంగ‌తి కొద్దిమందికే తెలుసు. ఫేమ‌స్ నిర్మాత వి.బి.రాజేంద్ర ప్ర‌సాద్‌, ముర‌ళిమోహ‌న్‌, దాస‌రి నారాయ‌ణ‌రావు వంటి ప్ర‌ముఖులు స‌హా ఎంద‌రో స్టార్ ప్రొడ్యూస‌ర్స్ అండ‌దండ‌ల‌తో ఈ దైవ‌స‌న్నిధానం గ‌త మూడు- నాలుగు ద‌శాబ్ధాలుగా విజ‌య‌వంతంగా ర‌న్ అవుతోంది. ఇక్క‌డ‌ మెగా ఫ్యామిలీ, నంద‌మూరి ఫ్యామిలీ, జ‌గ‌ప‌తిబాబు ఫ్యామిలీ, ముర‌ళీమోహ‌న్ ఫ్యామిలీ స‌హా ప‌లువురు టాప్ ప్రొడ్యూస‌ర్ల కుటుంబాలు, స్టార్ల కుటుంబాలు పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తుంటాయి.

హీరో జ‌గ‌ప‌తిబాబు తండ్రి వి.బి.రాజేంద్ర ప్ర‌సాద్ ఛైర్మ‌న్‌గా ఈ దైవ‌స‌న్నిధానం నిత్య‌పూజ‌లతో విరాజిల్లింది. చిత్త‌శుద్ధి ఉన్న భ‌క్తుడిగా ఆయ‌న దైవ‌స‌న్నిధానానికి సేవ‌లందించారు. ముర‌ళీ మోహ‌న్ వంటివారు దైవ‌స‌న్నిధానం ఛైర్మ‌న్‌గా కొన‌సాగ‌డం సేవ‌లందించ‌డం విశేషం. తాజాగా దైవ‌స‌న్నిధానం ఛైర్మ‌న్‌గా మంచు మోహ‌న్‌బాబు బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఈ సంద‌ర్భంగా టి.సుబ్బిరామ‌రెడ్డి స‌మ‌క్షంలో జ‌రిగిన ప్ర‌త్యేక పూజా కార్య‌క్ర‌మాల్లో మోహ‌న్‌బాబు పాల్గొన్నారు.