రివ్యూలపై కౌంటర్ వేసిన మరో హీరో..

Thursday, September 28th, 2017, 09:16:19 AM IST

చాలా రోజుల తర్వాత మళ్లీ రివ్యూలా వివాదం తార స్థాయికి చేరుతోంది. హీరోలు సమీక్షలపై తీవ్ర స్థాయిలో అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. డీజే సినిమా రిలీజ్ తర్వాత అల్లు అర్జున్ రివ్యూలపై ఏ స్థాయిలో స్పందించారో అందరికి తెలిసిన విషయమే ఆ తర్వాత చిత్ర దర్శక నిర్మాతలు కూడా కొన్ని కౌంటర్లు వేశారు. అయితే రీసెంట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా జై లవకుశ సక్సెస్ మీట్ లో సమీక్షలపై తనదైన శైలిలో స్పందించారు. ఉదాహరణతో సమీక్షలపై ఓ కౌంటర్ కూడా వేశారు.

అయితే ఇప్పుడు మంచి విష్ణు కూడా ఈ విషయంపై స్పందించారు.ఎంతో కష్టపడి తెరకెక్కిస్తున్న సినిమాలను ఏకాగ్రతతో చూడకుండా మూవీని చూస్తున్నపుడు అప్ డేట్స్ ద్వారా రివ్యూలు ఇస్తున్నారని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పేర్కొన్నాడు. అంతే కాకుండా సినిమాను సరిగ్గా చూస్తే అసలైన సమీక్ష బయటకి వస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ మధ్యా చాలా వరకు కొందరు అసలైన రివ్యూలను ఇవ్వలేదని చెబుతూ.. సినిమా చూస్తున్నప్పుడు ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వకుంటే మంచిదని మంచి విష్ణు తెలిపాడు.

  •  
  •  
  •  
  •  

Comments