భారత దేశాన్ని రెండు దేశాలుగా విడగొట్టాలి అంటున్న ప్రముఖ హీరో

Wednesday, January 25th, 2017, 12:32:32 PM IST

vishnu
2016లో ‘ఆడో రకం.. ఈడో రకం’ సినిమాతో మంచి హిట్ అందుకున్న మంచు విష్ణు తాజాగా ‘లక్కున్నోడు’ అనే చిత్రంలో నటించాడు. ఈ సినిమా శుక్రవారం విడుదల కాబోతుంది. దీంతో విష్ణు ఈ సినిమా ప్రమోషన్ లో పాల్గొంటూ బిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఉద్యమం మొదలైంది. మంచు విష్ణు ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ భారతదేశంపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆ ఇంటర్వ్యూలో మంచు విష్ణు ఏం చెప్పారంటే… ‘శాంతియుత పోరాటం ద్వారానే భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిందన్న సంగతి జల్లికట్టు పోరాటం మనకు గుర్తు చేస్తుంది. ఆ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని మనం ప్రత్యేక హోదా కోసం ఉద్యమించాలి. వారు చేస్తున్న పోరాటానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్నారు. అంతేకాదు దక్షిణాది ప్రజలు నిర్ణయిస్తేనే ఢిల్లీ లో ప్రభుత్వాలు ఏర్పాటు అవుతున్నాయని, కానీ ఉత్తరాది వారి నుండి మనకు సరైన గుర్తింపు రావడం లేదని తన ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటపుడు దేశం కలిసి ఉండి లాభం ఏంటని, దేశాన్ని ఉత్తరాది, దక్షిణాది ప్రాంతాలను రెండు వేర్వేరు దేశాలుగా విడగొట్టేస్తేనే బాగుంటుంది అన్నారు. సరైన గుర్తింపు లేనపుడు కలిసి ఉండడం కంటే విడిపోవడమే మంచిదని’ సంచలన వ్యాఖ్యలు చేశారు.