ఎస్సీ వర్గీకరణకు సీఎం స్పష్టత ఇవ్వాలి – మందకృష్ణ మాదిగ డిమాండ్

Thursday, July 18th, 2019, 01:58:21 AM IST

బుధవారం నాడు గుంటూరు జిల్లా, మంగళగిరిలోని పెన్షనర్ హల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశనికి హాజరైన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ గారు హాజరయ్యారు. ఈసందర్భంగా విలేకరులతో మాట్లాడిన మందకృష్ణ, ఏపీ ముఖ్యమంత్రి పై సంచలన వాఖ్యలు చేశారు. ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ఎస్‌సి వర్గీకరణ బిల్లును శాసనసభలో పెట్టి 24 గంటల్లో తీర్మానం చేయాలని, ఒకవేళ దీనిపై స్పష్టత ఇవ్వకుంటే స్పష్టతివ్వకుంటే 48 గంటల్లో కార్యాచరణ ప్రకటిస్తామని మందకృష్ణ డిమాండ్ చేశారు. అంతేకాకుండా అసెంబ్లీలో సిఎం జగన్‌మోహన్‌రెడ్డి వర్గీకరణపై వ్యతిరేకంగా మాట్లాడడాన్ని మందకృష్ణ తీవ్రంగా ఖండించారు.

అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కడపకు ఎంపీగా ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ప్రధానికి లేఖ రాశారని, అంతేకాకుండా ప్రస్తుత వైసీపీ పార్టీని ఆవిర్భవించాక తదుపరి ఇడుపులపాయలో ఏర్పాటుచేసుకున్న సభలో ఎస్సీ వర్గీకరణపై తీర్మానం కూడా చేశారని మందకృష్ణ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ ఎస్సీ వర్గీకరణ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరి ఏంటో ప్రశ్నించాలని మందకృష్ణ చెప్పారు. అయితే ఎమ్మార్పీఎస్ పార్టీ జగన్ కి పూర్తిగా సహకారం అందిస్తుందని మందకృష్ణ తెలిపారు.