ఎయిర్‌పోర్ట్‌ను తలదన్నే రీతిలో రైల్వే స్టేషన్.. ఎక్కడో తెలుసా..!

Thursday, June 13th, 2019, 11:35:17 AM IST

సాధారణంగా రైల్వే స్టేషన్ అంటే ముందుగా గుర్తొచ్చేవి, అందరికి కనిపించేవి ప్లాట్ ఫారంలు, రైల్ పట్టాలు, ప్రయాణికులు కూర్చోడానికి చెక్క బల్లాలు, స్టేషన్‌లో చూడడానికి పెద్ద డబ్బా టీవీలు. ఇది ఒకప్పటి మాట. కానీ ప్రస్తుతం ట్రెండ్ మారింది. మారుతున్న కాలానికి అనుగుణంగా పాత పద్ధతులు పోయి కొత్త పద్ధతులు ఎలాగైతే వస్తున్నాయో పాత స్టేషన్లు కాస్త రూపు రేఖలను మార్చుకుని కొత్త తరహాలో కనిపిస్తున్నయి.

కానీ ఇప్పటికి పెద్ద పెద్ద స్టేషన్లలో తప్పా చిన్న చిన్న రైల్వే స్టేషన్‌లలో కనీస సౌకర్యాలు కూడా సరిగ్గా ఉండవు. అయితే ఉత్తర్‌ప్రదేశ్ వారణాసి దగ్గరలో ఉన్న మండువాడిహ్ అనే రైల్వే స్టేషన్ మాత్రం ఒక ఎయిర్‌పోర్ట్‌ను తలదన్నే స్థాయిలో ఉందట. ఎల్ఈడీ దీపాలు, ప్రయాణికులు వేచి ఉండడానికి ప్రత్యేక లాబీలు, ప్లాట్ ఫారంపై స్టెయిన్ లెస్ స్టీల్ బెంచీలు ఇల్ల ప్రతి ఒక్కటి ఒక ప్రత్యేకమే. ఇక టికెట్ బుకింగ్ కార్యాలయం, క్యాంటీన్స్, వెయిటింగ్ రూంస్ కూడా కార్పోరేట్ ఆఫీసులను తలదన్నేలా ఉన్నాయి. ప్రయాణీకుల కోసం ఏసీ, నాన్ ఏసీ రూములు స్టేషన్ మొత్తం ఎల్ఈడీ దీపాలు, ఎల్ఈడీ స్క్రీన్స్‌ను ఉంచారు. అంతేకాదు ప్రయాణికులకు కనువిందు చేసేందుకు స్టేషన్ చుట్టు చెట్లు, అక్కడక్కడ వాటర్ ఫౌంటేయిన్లు నిర్మించారు. ఈ స్టేషన్‌లో మొత్తం 8 ప్లాట్ ఫారంలు, రోజు 8 రైళ్ళు ఇక్కడ నుంచే వెల్తుంటాయి. అయితే ఇంత అద్భుతంగా ఈ స్టేషన్‌ను మార్చడమే కాకుండా, ఎంతో మంది వారణాసి ప్రజలకు కూడా ఉద్యోగాలు ఇచ్చి వారికి జీవనోపాధి కల్పిస్తున్నారు. అయితే గతంలో కేంద్ర రైల్వే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మనోజ్ సిన్‌హా మండువాడిహ్ పేరును బనారస్ రైల్వే స్టేషన్‌గా పేరు మార్చాలని యూపీ ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్‌కి లేఖ కూడా పంపారు. అయితే ఈ పార్లమెంటరీ ప్రాంతానికి ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తుండడం, హిందువుల పుణ్యక్షేత్రం కావడంతో ఈ రైల్వే స్టేషన్‌ను ఇంత అద్భుతంగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం ఈ స్టేషన్ ఒక ఎయిర్‌పోర్ట్‌లా ఉండడంతో అందరి చూపును ఆకట్టుకుంటుంది.