కంగ‌న దెబ్బ‌కు పారిపోయి వ‌చ్చేశాడు!

Sunday, September 9th, 2018, 01:34:53 PM IST

కంగ‌న అరాచ‌కాల గురించి ఏమ‌ని చెప్పాలి. క్వీన్ ప్ర‌తి ఒక్క‌రితో గొడ‌వ పెట్టుకుని చేస్తున్న ర‌చ్చ గురించి అటు బాలీవుడ్‌తో పాటు ఇప్పుడు టాలీవుడ్‌లోనూ ఆస‌క్తిగా మాట్లాడుకుంటున్నారు. టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ క్రిష్ ఈ అమ్మ‌డి నిర్వాకానికి కెరీర్ ప‌రంగా న‌ష్ట‌పోతున్నాడ‌న్న క‌ల‌త వ్య‌క్త‌మైంది.

వాస్త‌వానికి మ‌ణిక‌ర్ణిక సినిమాని క్రిష్ ఎంతో ఓపిగ్గా తెర‌కెక్కించాడ‌ని, కంగ‌న ఫింగ‌రింగ్ భ‌రించ‌లేక అత‌డు ముంబై వ‌దిలి పారిపోయి వ‌చ్చేశాడ‌ని ఉత్త‌రాది మీడియాలో ప్ర‌చారం సాగుతోంది. ప్ర‌స్తుతం క్రిష్ ఎన్టీఆర్ సినిమా ఆన్‌సెట్స్ ఉంది. ఈలోగానే కంగ‌న ద‌ర్శ‌కురాలిగా మ‌ణిక‌ర్ణిక బాధ్య‌త‌లు చేప‌ట్టింది. అంతేకాదు క్రిష్ తెర‌కెక్కించిన 43 రోజుల విజువ‌ల్స్‌ని క‌ట్ చేయించి వాట‌న్నిటినీ తిరిగి రీషూట్ చేస్తోందిట‌. ఇక సినిమా ఆద్యంతం త‌న మార్క్ మాత్ర‌మే కావాల‌ని త‌పిస్తోంద‌ని తెలుస్తోంది. ఇది నిజంగా ఓ క్రియేట‌ర్‌ని అవ‌మానించ‌డ‌మే. కంగ‌న ఇంత మొండిగా ఎందుకిలా చేస్తోంది? అస‌లు క్రిష్‌తో త‌లెత్తిన వివాదం ఏ స్థాయిలోనిది? అంటూ చ‌ర్చ సాగుతోంది. మ‌రోవైపు త‌న‌పై చిత్రీక‌రించిన మ‌ల్ల యుద్ధ స‌న్నివేశాల్ని తొల‌గించిందంటూ మ‌ణిక‌ర్ణిక ప్రాజెక్టు నుంచి సోనూ సూద్ త‌ప్పుకున్నార‌ని ప్ర‌చారం సాగుతోంది. అస‌లింత‌కీ కంగ‌న వ్య‌వ‌హారం ఏంటో అర్థం కావ‌డం లేద‌ని మాట్లాడుకుంటున్నారంతా.

  •  
  •  
  •  
  •  

Comments