గాంధీ జ‌యంతికి `మ‌ణిక‌ర్ణిక` ట్రీట్‌

Sunday, September 30th, 2018, 12:46:07 PM IST

క్వీన్ కంగ‌న ప్ర‌ధాన‌ పాత్ర పోషిస్తున్న `మ‌ణిక‌ర్ణిక` టీజ‌ర్‌ గాంధీ జ‌యంతి కానుక‌గా అక్టోబ‌ర్ 2న‌ రిలీజ్ కానుంది. స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధురాలు ఝాన్సీ రాణి పాత్ర గురించి కీల‌క‌మైన హింట్‌ను ఇవ్వ‌నుంది. ఇక‌పోతే గ‌త కొంత‌కాలంగా కంగ‌న చిత్ర‌యూనిట్‌తో పోరాటం సాగిస్తూ ఉంది. ద‌ర్శ‌కుడు క్రిష్‌, సోనూ సూద్ స‌హా నిర్మాత‌లు కంగ‌న‌పై అలిగార‌ని ప్ర‌చార‌మైంది. ఈ సినిమాకి ద‌ర్శ‌కుడు మారాడు. నిర్మాత‌లు అలిగి కంగ‌న‌ను వ‌దిలి వెళ్లార‌ని ప్ర‌చారం సాగింది. మ‌ణిక‌ర్ణిక బ‌డ్జెట్ రెట్టింపు పెర‌గ‌డానికి కంగ‌న ఫింగ‌రింగ్ ఓ కార‌ణ‌మైంద‌ని వివాదం చెల‌రేగింది.

అందుకే వీట‌న్నిటికీ స‌మాధానం చెప్పేందుకు టీజ‌ర్‌తో క్వీన్ రెడీ అవుతోంద‌ని తెలుస్తోంది. ఇక టీజ‌ర్ ఆవిష్క‌ర‌ణ వేళ య‌థావిధిగా మీడియా క్రిష్ గురించి, ఇత‌ర వివాదాల గురించి ప్ర‌శ్నించే వీలుంది కాబ‌ట్టి ఆయా విష‌యాల్లో కంగ‌న ఎమోష‌న్ ఏంటో ఆరోజు చూడాల్సి ఉంది. మ‌ణిక‌ర్ణిక 2019 జ‌న‌వ‌రిలో రిలీజ్ కానుంది. ఇదే చిత్రంతో టీవీ న‌టి అంకిత లోఖండే పెద్ద‌తెర‌కు ప‌రిచ‌యం అవుతోంది.